బుల్లిపిట్ట‌: అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో `ఐఫోన్ ఎస్ఈ` స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతంటే..?

Kavya Nekkanti

ఎప్పుడెప్పుడు కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వ‌స్తుందా అని చూసే ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐఫోన్ బ్రాండ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్ని ఫోన్లు మార్కెట్‌లోకి వ‌చ్చినా ఈ బ్రాండ్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అయితే తాజాగా యాపిల్ ఐఫోన్ ప్రియుల కోసం ఎప్పటినుంచో ఊరిస్తున్న త‌మ  ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల చేసింది. దీన్ని జనాదరణ పొందిన డిజైన్‌లో శక్తివంతమైన కొత్త స్మార్ట్‌ఫోన్' గా యాపిల్  ప్రకటించింది. 

 

ఐఫోన్ 11 హార్డ్‌వేర్, ఐఫోన్ 8 బాడీ, ఏ13 బయానిక్ చిప్‌సెట్‌తో ఐఫోన్ ఎస్ఈని రూపొందించింది యాపిల్. టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది. మన దేశంలో  రూ.42,500 (64 జీబీ వేరియంట్‌) నుంచి ప్రారంభం కానుంది. ఇది మాత్రమే కాకుండా 128 జీబీ, 256 జీబీ వేరియంట్లు కూడా అందుబాటులో  ఉండనున్నాయి. ఇక‌ రెడ్‌, బ్లాక్‌, వైట్‌ మూడు  క‌ల‌ర్స్‌ ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానున్నాయి.  ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ధర ఎంతో ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు.. 

 

డిస్‌ప్లే: 4.7 అంగుళాలు

 

వేరియంట్: 64జీబీ, 256జీబీ

 

ప్రాసెసర్: యాపిల్ ఏ13 బయానిక్ చిప్

 

రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 7 మెగాపిక్సెల్

 

ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 13

 

ధర: 64 జీబీ వేరియంట్- రూ.42,500

 

256 జీబీ వేరియంట్- రూ.58,300


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: