కరోనా యాప్స్ లలో లొకేషన్ ట్రాకింగ్ ని బ్యాన్ చేసిన యాపిల్ గూగుల్ సంస్థలు..!
కరోనా మహమ్మారి ప్రపంచం అంతటా విస్తరిస్తున్న వేళ అనేక దేశాలు ఆ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే గూగుల్ ఆపిల్ సంస్థలు ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో సరికొత్త టెక్నాలజీని ప్రభుత్వ యంత్రాంగాలకు అందజేస్తున్నాయి. 99 శాతం మంది ప్రజలు వాడే మొబైల్ ఫోన్లు యాపిల్ గూగుల్ సంస్థల ఆపరేటింగ్ సిస్టం మీదనే పనిచేస్తాయన్న సంగతి తెలిసిందే. గత నెలలో యాపిల్, గూగుల్ సంస్థలు కోవిడ్ 19 వ్యాధి సోకిన వారి చిరునామా తెలిపి సోకని వారిని జాగ్రత్త పరిచేలాగా చేస్తున్నామని తెలిపాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించుకున్న ఆయా సంస్థలు కేవలం ప్రభుత్వ యంత్రాంగానికి మాత్రమే కోవిడ్ 19 రోగులను ట్రేస్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి.
ఈ రెండు సంస్థలు కరోనా పీడితుల వ్యక్తిగత విషయాలు బయట పెట్టకుండా కట్టుదిట్టమైన ప్రైవసీ కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వారు డెవలప్ చేస్తున్న సిస్టం అనేది కేవలం కరోనా వ్యాధిగ్రస్తుల ఫోన్ బ్లూటూత్ సిగ్నల్స్ మాత్రమే ట్రేస్ చేస్తుంది కానీ జీపీఎస్ లొకేషన్ ని ట్రాక్ చేయదు. జిపిఎస్ చరిత్ర కూడా ఇతరులు యాక్సెస్ చేసేందుకు అవకాశం లేకుండా చేసేందుకు ఈ రెండు సంస్థలు పని చేస్తున్నాయి. అమెరికా దేశంలో కరోనా వైరస్ ని ట్రేస్ చేసే అప్లికేషన్స్ ని డెవలప్ చేసిన నిపుణుల మాట్లాడుతూ... కరోనా రోగులకు కాంటాక్ట్ లో ఉన్న వారిని ట్రేస్ చేసేందుకు తప్పకుండా జిపిఎస్ సిస్టమ్ ని యూస్ చేయాలి అని అన్నారు.
ఏది ఏమైనా ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తున్న జీపీఎస్ సిస్టం ట్రేసింగ్ పద్ధతి వలన ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకొక మార్గం ఉంది కానీ ఆ మార్గాన్ని అనుసరిస్తే... కరోనా సోకిన వారందరిని కచ్చితంగా గుర్తించేందుకు వీలుపడదు. అల్బెర్టా, ట్వంటీ అనే సాఫ్ట్వేర్ సంస్థలు మాత్రం గూగుల్ యాపిల్ సంస్థలను అనుసరించమని... జీపీఎస్ బ్లూటూత్ సిగ్నల్స్ ని ఆధారంగా చేసుకొని కొత్త కరోనా రోగులను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలుపుతున్నాయి. కాగా ఒక దేశం ఒక్క అప్లికేషన్ ని మాత్రమే వినియోగించవలసిందిగా గూగుల్ యాపిల్ సంస్థలు చెబుతున్నాయి.