టెక్నాల‌జీ: 4జీ డేటాతో జియో నుంచి అదిరిపోయే ప్లాన్స్ మీ కోసం..!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న చాలా మంది ఇంటర్నెట్‌ను తెగ వాడేసుకుంటున్నారు. దీంతో ఇంటర్నెట్‌ వినియోగం అమాంతం పెరిగిపోయింది. అయితే ఇలాంటి స‌మ‌యంలో త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు రిలయన్స్ జియో అద్భుత‌మైన ప్లాన్స్‌ను తీసుకువ‌స్తోంది. అలాంటి వాటితో ఇటీవ‌ల వ‌చ్చిన బెస్ట్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రూ.599 ప్లాన్‌.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా చొప్పున 168 జీబీ హైస్పీడ్ 4జీ డేటా యూజ్ చేసుకోవ‌చ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 3,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. 

 

రూ.444 ప్లాన్‌.. ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా చొప్పున 112 జీబీ హైస్పీడ్ 4జీ డేటా  యూజ్ చేసుకోవ‌చ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 2,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. 

 

రూ.2399 ప్లాన్‌.. ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా చొప్పున 730 జీబీ హైస్పీడ్ 4జీ డేటా యూజ్ చేసుకోవ‌చ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 12,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. 

 

రూ.399 ప్లాన్‌.. ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 84 జీబీ హైస్పీడ్ 4జీ డేటా యూజ్ చేసుకోవ‌చ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 2,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. ఇక ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్లాన్ల‌కు జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: