బుల్లిపిట్ట: నోకియా 8.3 5జీ లాంచ్ ఇక అప్పుడే.. కాకపోతే ధర, స్పెసిఫికేషన్లు ఫిక్స్...!
నిజానికి ఈ ఫోన్ సంబంధించిన అప్డేట్ నోకియా కంపెనీ మార్చి నెలలోనే ప్రకటించింది. ఈ ఫోన్ తో పాటు నోకియా 1.3, నోకియా 5.3 మోడళ్లను కూడా నోకియా ప్రకటన చేసింది. అయితే నోకియా 8.3 మోడల్ లో 5g ఫీచర్ ను అందించడం ద్వారా దీనిని మొదట గ్లోబల్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ మొబైల్ గా కంపెనీ ప్రకటన చేసింది. ఇక ఇందులో స్నాప్ డ్రాగన్ కంపెనీ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 765 g ప్రాసెసర్ పై పని చేయనుంది. ఈ మొబైల్ 6.81 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంది. వీటితో పాటు హెచ్‌డిఆర్ సపోర్టు కూడా అందించనుంది. 20:9 యాక్సెప్ట్ రేషియో ఇందులో నిక్షిప్తం చేశారు. ఇక ఈ మొబైల్ సంబంధించి కెమెరా చూస్తే 24 మెగాపిక్సల్ జిఎస్ పిక్స్ కెమెరాలను పొందుపరిచారు. ఈ ఫోన్ కు సంబంధించి ధరను చూస్తే 599 యురోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే భారతదేశ కరెన్సీలో ఏకంగా 47 వేల నుండి 52 వేల వరకు ఈ మొబైల్ ధర ఉండబోతుందని తెలుస్తోంది.
అలాగే ఈ మొబైల్ లో 6 జిబి ర్యామ్, 64mp, 12 mp, 2mp, 2mp కెమెరాలను రియర్ కెమెరా గా విడుదల చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరా గా 24 మెగాపిక్సల్ గా అందిస్తున్నారు. అలాగే ఈ మొబైల్ లో 4500 mah బ్యాటరీని పొందుపరిచారు. డిస్ప్లే సైజు 6.81 ఇంచేస్ గా ఉంది. ఇక ఈ మొబైల్ ని భారతదేశంలో సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ లో ఇంటర్నల్ మెమొరీ 64 gb నుండి 512 gb వరకు దీన్ని పెంచుకోవచ్చు.