బుల్లిపిట్ట: ఒప్పో ఏ52 కొత్త వేరియంట్ ఫీచర్స్, ధర చూడాల్సిందే...!

Suma Kallamadi
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయనుకుంటున్నారా..? మరి ఒప్పో ఎన్నో గొప్ప ఫీచర్లు అందిస్తోంది కదా... మరి ఎందుకు చింత...? ఈ ఫీచర్లు, ధర అన్ని క్లుప్తంగా చూసేయండి. తాజాగా స్మార్ట్ ఫోన్ లో కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ వేరియంట్ 8 జీబీ ర్యామ్ తో రానుంది. ఈ ఫోన్ ని మీరు కొనుగోలు చెయ్యాలంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్ దాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఇది ఆ రోజే  లాంచ్  అవ్వడం విశేషం.


ఈ వేరియంట్ లో హోల్ పంచ్ డిస్ ప్లే, వెనకవైపు నాలుగు కెమెరాలు కూడా ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో ఇది వస్తోంది. దీని ధర కేవలం రూ.18,990గా ఉంది. అలానే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గా ఉంది. ఛార్జింగ్  విషయం లోకి వస్తే  18W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ ఆడియో స్పీకర్లు, డిరాక్ 2.0 ఆడియో టెక్నాలజీ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. రంగులు అయితే ట్విలైట్ బ్లాక్, స్ట్రీమ్ వైట్ అందుబాటులో ఉన్నాయి.


ఈ ఫోన్ కి నాలుగు కెమెరాలు ఉండగా... ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరో రెండు 2 మెగా పిక్సెల్ సెన్సార్లని అందించారు. ఇక ముందువైపు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్   ఓఎస్ 7.1 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.5 అంగుళాల డిస్ ప్లే ఉండగా స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 శాతంగా ఉంది. దీని బరువు 192 గ్రాములుగా ఉంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఫీచర్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: