బుల్లిపిట్ట: పోకో ఎం2 ప్రో ధర, ఫీచర్లు ఇవే...
పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999 ఉంది. అదే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. అలానే ఫోన్ కలర్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ అందుబాటులో ఉన్నాయి.
6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5 కూడా ఉంది. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండగా ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ , 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ తో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం డిస్కౌంట్ వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు రూ.1,556 నుంచి ప్రారంభం కానున్నాయి.