బుల్లిపిట్ట: బంపర్ ఆఫర్...ఇప్పుడు తగ్గిన ఒప్పో రెనో 3 ప్రో ధర...!
ఇండియాలో భారీ 44MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో తీసుకురాబడిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక 64MP క్వాడ్ సెటప్ ను 20X క్లియర్ జూమ్ తో పాటుగా అందిస్తోంది. ఆడియో పరంగా కూడా Hi-Res audio మరియు Dolby Atmos వంటి అద్భుతమైన ప్రత్యేకతలని ఒప్పో అందిస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర 3,000 రుపాయలు తగ్గింది. దీనితో ఆల్ టైం తక్కువ ధరకు అందిస్తోంది . ఒప్పో రెనో 3 ప్రో (8GB + 128GB ) రూ. 27,990 , ఒప్పో రెనో 3 ప్రో (8GB + 256GB ) రూ. 29,990 గా ఉంది.
అలానే ఈ ఫోన్ ఫీచర్లు కూడా అదిరిపోయాయి. స్క్రీన్ విషయానికి వస్తే, ఒక 6.4-అంగుళాల Full HD + Super AMOLED డిస్ప్లేని 91.5 శాతం స్క్రీన్ టూ బాడీతో కలిగి ఉంది. అలానే డ్యూయల్ సెల్ఫీ కోసం కొంచెం పెద్దదైన పంచ్ హోల్ నోచ్ డిజైన్ ఉంది. అలానే అరోరల్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు స్కై వైట్ కలర్స్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అలానే 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా కూడా అదుర్స్ అనే చెప్పాలి. ఒప్పో రెనో 3 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది 5X ఆప్టిక్ జూమ్ లేదా 20X హైబ్రిడ్ జూమ్ చెయ్యగల f / 2.4 ఎపర్చరు కలిగిన ఒక 13MP లెన్స్ కి జతగా f/1.8 ఎపర్చర్ గల 64MP ప్రధాన సెన్సార్, దీనితో పటు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి.