రియల్ మీ కంపెనీ నుండి మరో సంచలనం: REALME V5

VAMSI
ప్రస్తుతం ఉన్న మొబైల్ రంగంలో ఒప్పో, రెడ్ మీ & వివో మొబైల్స్ కు దీటుగా పోటీ ఇస్తూ సేల్స్ పరంగా దూసుకెళ్తున్న మరో కంపెనీ రియల్ మీ మొబైల్స్. ఇప్పటికే ఈ కంపెనీ నుండి చాలా మోడల్స్ వచ్చి ఉన్నాయి.  వినియోగదారులు కూడా ఈ మొబైల్స్ ను ఆదరించారు. ముఖ్యంగా రియల్ మీ మొబైల్స్ అంటే అందరికీ గుర్తొచ్చే కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ మొబైల్స్   చాలా స్ట్రాంగ్ గా చేయబడి ఉంటాయి.
అలాగే డిస్ప్లే డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.



మరో ముఖ్యమైన విషయం ఎప్పటిలాగే ఇందులో కూడా ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చడం జరిగింది. ఈ మొబైల్స్ కూడా షావోమీ కంపెనీకి చెందినదే అయినా, ఎందుకనో సపరేట్ కంపెనీగా వినియోగదారుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మధ్యనే విడుదల చేసిన రియల్ మీ C12 &  రియల్ మీ C15   మొబైల్స్   కూడా మంచి ఫీచర్స్ తో, అంతకుమించి మంచి రివ్యూస్ తో వినియోగదారులను ఆకట్టుకున్నాయి.

 

మీకందరికీ తెలిసే ఉంటుంది రియల్ మీ కంపెనీ నుండి ఎప్పుడు  కొత్తగా  ఏ మొబైల్ వచ్చినా, వీటిని కొనడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ మొబైల్స్ అన్ని తరగతుల వాళ్ళు కొనగలిగే విధంగా అతి తక్కువ ధరలకే మన ముందుకు తీసుకు వస్తున్నారు. దీనికి ముందు విడుదలైన రియల్ మీ ఫోను ల కంటే దీనిని ఎంతో స్మార్ట్ గా తయారు చేయబడి ఉంది. దీని ధర విషయానికి వస్తే కేవలం Rs.16, 190/- రూపాయలు మాత్రమే.

మరి ఇంతగా ఇందులో ఏమి ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం.
COMPANY         : REALME
MOBILE NAME: V5
DISPLAY SIZE   : 6.5 INCHES
RAM                      : 6 GB
MEMORY             : 128 GB        UP TO 256 GB
CAMERA              : 48 mp, 08  MP, 02 mp & 02 MP
FRONT CAM       : 16 MP
BATTERY              : 5000 MAH
PROCESSOR      : OCTA CORE DUAL   & CHIP SET:  TEK 720   MT6853
OPERATING SYSTEM: ANDROID V10....

ఈ మొబైల్ ని మీరు సొంతం చేసుకోవాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: