తక్కువ ధరకే లభించనున్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్

Suma Kallamadi
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లను తక్కువ ధరలకే ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదటగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్ స్మార్ట్ ఫోన్ ని తక్కువ ధరలకే మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న శాంసంగ్ తమ వినియోగదారులందరికీ ఫోల్డబుల్ ఫోన్లు అందుబాటులో ఉండాలని యోచిస్తున్నట్టు స్పష్టమవుతుంది. నివేదికల ప్రకారం ఇప్పటి వరకు విడుదలైన శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల మాదిరే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్ ఉంటుందని కానీ ధర మాత్రం మిగతా అన్నిటి కంటే చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్ మోడల్ నెంబర్ ని SM-F415F గా జిఎస్ఎం వెబ్సైట్ వెల్లడించింది. ఇక్కడ F అనే లెటర్ యొక్క అర్థం ఫోల్డబుల్ అని తెలుస్తోంది. జిఎస్ఎం వెబ్సైట్ తో పాటు శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్సైట్ లో కూడా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్ మోడల్ నెంబర్ SM-F415F కనిపించింది.


భారత దేశంలో ‘లైట్’ ఫోల్డ్ ప్రారంభించబడుతుందనే వార్త తప్ప ఈ అధికారిక వెబ్సైట్ లో మరే వివరాలు కనిపించలేదు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్ లో స్నాప్‌డ్రాగన్ 865 ఉపయోగించారని కానీ 5 జికి ఈ ఫోన్ సపోర్టు చేయదని, మిగతా ఫోల్డబుల్ ఫోన్ల మాదిరి అల్ట్రా తిన్ గ్లాస్ లేయర్ కలిగి ఉండదని తెలుస్తోంది.


ఈ లైట్ ఫోల్డబుల్ ఫోన్ లో కొన్ని ఇతర ఫ్యూచర్లు కూడా మిస్ అవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే దీనికి కేవలం $1,100 లకు అమ్మకానికి తెస్తుంది శాంసంగ్ సంస్థ. అంటే మన భారత కరెన్సీలో రూ. 80,441 కంటే తక్కువ ధర అన్నమాట. నిజానికి 80 వేల రూపాయలు అంటే తక్కువ ధర ఏమీ కాదు కానీ ఇప్పటి వరకు విడుదలైన అన్ని కంపెనీల ఫోల్డబుల్ ఫోన్స్ తో పోలిస్తే ఇది ఖచ్చితంగా తక్కువ ధరకే లభించనుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: