మన చాట్స్ సురక్షితమేనా.. వాట్సాప్ ఏమంటుందో తెలుసా..?
అంతేకాదు వాట్సాప్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ అందిస్తున్నామని తెలిపారు. దీనిని ద్వారా మీరు కమ్యూనికేట్ చేస్తున్నవ్యక్తి మాత్రమే ఆయా సందేశాలను చదవగలరని తెలిపారు. తప్ప, మధ్యలో ఎవరూ దీన్ని యాక్సెస్ చేయలేరని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్‌ను మాత్రమే వాట్సాప్‌లో ఉపయోగిస్తారు. ఇక మిగతా సమాచారం లీక్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ ప్రతినిది ఒకరు తెలిపారు. అలాగే ఫోన్ డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా బలమైన పాస్వర్డ్లు లేదా బయోమెట్రిక్ ఐడీలు వంటి అన్ని భద్రతా ఫీచర్లను సద్వినియోగం చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేశారు.
అయితే సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తోపాటు, టాలెంట్ ఏజెంట్ జయ సాహా సెల్‌ఫోన్ నుంచి సేకరించిన 2017 నాటి వాట్సాప్ చాట్ వ్యవహాం హాట్ టాపిక్ గా మారిందన్నారు. ఈ చాట్ల ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్ హీరోయిన్స్ సారా ఆలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి నటులకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఈ ప్రకటన జారీ చేసిందని తెలిపారు.