బుల్లిపిట్ట: ఐదు కెమెరాలతో వచ్చిన మొట్టమొదటి శాంసంగ్ ఫోన్ ఇదే!
ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్గా ఉంది. 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లను ఈ ఫోన్ లో అందించింది. అలానే సెల్ఫీల కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించనున్నట్లు కూడా కంపెనీ చెప్పింది.
ఐదు కెమెరాలతో ఇప్పటికే ఆకట్టుకుంది నోకియా 9. శాంసంగ్ ఐదు కెమెరాల ఫోన్ వచ్చే ఏట నుంచి లాంచ్ చేయనుందని కూడా సమాచరం. ఇది ఇలా ఉండగా ఏ -సిరీస్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వచ్చే కొద్ది ఫోన్ల లో గెలాక్సీ ఏ72 కూడా ఒకటని వెల్లడించారు. కేవలం ఈ ఫోన్ కి మాత్రమే కాకుండా ఈ ఫీచర్ను వచ్చే సంవత్సరం మరిన్ని హైఎండ్ ఏ-సిరీస్ ఫోన్లకు కూడా అందించనుంది అని సమాచారం. మరి ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టంలో ప్రత్యేకమైన హార్డ్వేర్, సాఫ్ట్ వేర్ ఫీచర్లను తప్పక అందిస్తారు. ఇలా దీనిని అందించడం వల్ల ఫోటో బ్లర్ అవ్వకుండా ఎంతో క్లియర్ గా వస్తాయి.