శాంసంగ్ గెలాక్సీ లోని ఆ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్లు.. మరి ధర విషయానికొస్తే..

Satvika
రోజుకో కొత్త కంపెనీ మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి.. అయితే వాటికి ఉన్న ప్రత్యేకతలు వల్ల చాలా మంది ఆ ఫోన్లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు కూడా ఎక్కువగా కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ కొత్త మొబైల్ ను రూపొందించింది. ఆ ఫోన్ గురించి మార్కెట్ లో ఒక వార్త సంచలనంగా చక్కర్లు కొడుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్ సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేశారు..


ఆ ఫోన్ కు గల ప్రత్యేకతలు , ఫీచర్లు గురించి  ఇప్పుడు తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఎం01 స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం జూన్‌లో మనదేశంలో లాంచ్ అయింది, ఆ ఫోన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు గెలాక్సీ ఎం02ని కూడా శాంసంగ్ మనదేశంలో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ఇంచు మించు కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే కొద్దిగా మార్పులో .. వాటితో పాటుగా మరి కొన్ని ఫీచర్స్ ను అందివ్వనున్నారు.

కాగా ఈ ఫోన్ ను లాంఛ్ చేయనున్నట్లు శాంసంగ్ అధికారులు స్మార్ట్ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సై‌ట్లో కనిపించింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో లాంచ్ కానుందని టాక్ ఆ నోటా, ఈ నోటా పాకింది ఇప్పుడు.. తక్కువ ధరతోనే మనదేశంలో లాంచ్ కానుంది. ఈ లిస్టింగ్‌ను మొదట రూట్ మైగెలాక్సీ గుర్తించింది. దీని ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎం02లో డ్యూయల్ సిమ్ ఫీచర్ ఉండనుంది..ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 3 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం01 స్పెసిఫికేషన్లను ఒకసారి చూస్తే..ఎం02 లో కూడా దాదాపు అదే ఉంటుంది.. కెమెరాల ను చూస్తే..13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలను ఇందులో అందించారు. ఇక ముందువైపు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.. మార్కెట్ డిమాండ్ ను బట్టి రేట్లు ఫిక్స్ చేస్తున్నట్లు శాంసంగ్ అధికారులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: