బుల్లిపిట్ట: ఒక్కరోజులో వాట్సాప్ ద్వారా ఎన్ని మెసేజ్‌లు వెళ్తాయంటే..!

Suma Kallamadi
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికీ వాట్సాప్ ఖచ్చితంగా ఉంటోంది. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ లేని వాళ్ళు చాల అరుదు. అయితే ఈ ప్రపంచ జనాభాలో వాట్సాప్  ని ఎంత మంది ఉపయోగిస్తున్నారో తెలుసా...?  దాదాపు 250 కోట్ల మంది. ఇది ఇలా ఉండగా మార్క్ ఏమన్నారంటే ...?  ఫేస్‌బుక్‌కు చెందిన యాప్స్‌ను ప్రతి రోజూ ఉపయోగిస్తున్నారని, యాడ్లు ఇచ్చేవారు కోటి మందికి పైగా ఉన్నారని  తెలిపారు. రోజు రోజుకి వాట్సాప్ ని వినియోగించే వారి సమాఖ్య పెరగడమే కాక  ప్రతియేటా కొత్త సంవత్సర వేడుక సమయంలో వాట్సాప్ మెసేజ్‌ల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంటుంది అని అన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్ల మార్కును వాట్సాప్ దాటింది. 2017 నూతన సంవత్సవర వేడుకల్లో 6.3 వేల కోట్ల మెసేజ్‌లు , 2018లో 7.5 వేల కోట్ల మెసేజ్‌లు వెళ్లడం జరిగిందన్నారు. అలానే 2019లో రికార్డు స్థాయిలో 10 వేల కోట్ల మెసేజ్‌లు వెళ్లాయి అని అన్నారు. అదే ఇప్పటికి వచ్చే సరికి 10 వేల కోట్ల మెసేజ్‌లు వెళ్తున్నాయి అని అన్నారు. స్టాటిస్టా అనే సంస్థ అందించిన రిపోర్టు ప్రకారం ఈ సంవత్సరం జనవరి నాటికి వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో 500 కోట్ల సార్లు డౌన్ లోడ్ అయినట్లు తెలుస్తోంది. గూగుల్ తర్వాత ఇన్నిసార్లు డౌన్ లోడ్ అయింది వాట్సాపే.

ఫేస్ బుక్ మెసెంజర్, ఇన్ స్టాగ్రామ్ మెసేజింగ్‌ను కలిపినట్లు ఈ సందర్భంగా మార్క్ జుకర్ బర్గ్ కొత్త ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్ గురించి కూడా చెప్పడం జరిగింది.  మంచి స్పందనే వచ్చిందని తెలుస్తోంది. ఆల్వేస్ మ్యూట్ అనే ఫీచర్ ద్వారా చాట్లను శాశ్వతంగా మ్యూట్ చేసే అవకాశం ఉంది. ఇలా రోజు రోజుకి మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: