గుడ్ న్యూస్: తక్కువ ధరలో ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్..!

Suma Kallamadi
మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా... అయితే మీకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలోనే ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ ఒప్పో సంస్థ విడుదల చేసింది. ఇప్పటికే భారత మార్కెట్ లో ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అయితే ఈ మోడల్ లో 3జీబీ+32జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను గత నెలలోనే సంస్థ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,990. ఇప్పుడు 2జీబీ+32జీబీ వేరియంట్‌లో కొత్త మోడల్‌ని పరిచయం చేసింది ఒప్పో ఇండియా. ఈ ఫోన్ ధర రూ.9,490గా ఉంది.

రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు వివో ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇక 7.9ఎంఎం సైజ్‌లో ఉండే సన్నని స్మార్ట్‌ఫోన్ 6.52 అంగుళాల వాటర్‌డ్రాప్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అయితే 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్‌డీ+ రెజల్యూషనల్, ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ చిప్‌సెట్ లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో పొందుపర్చారు. ఫ్రంట్ కెమెరాలో నేచురల్ బ్యూటీ, ఏఐ బ్యూటిఫికేషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక కలర్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్, త్రీడి ఫింగర్ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ లాంటి ఫీచర్స్ ను ఈ స్మార్ట్ ఫోన్ అందించనుంది.

ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే 6.52 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ర్యామ్ 2జీబీ ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో పీ35 ఉంటుంది. రియర్ కెమెరా 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా+2 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా+2మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సల్ ఉంది. బ్యాటరీ 4230 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ కలర్ ఓఎస్ 7.2 + ఆండ్రాయిడ్ 10ను అందించారు. సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కలర్స్ డైనమిక్ బ్లాక్, మిస్టరీ బ్లూ వంటి రంగుల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: