2020 లో అధిక మంది సెర్చ్ చేసి, కొనుగోలు చేసిన ఫోన్లు ఇవే..

frame 2020 లో అధిక మంది సెర్చ్ చేసి, కొనుగోలు చేసిన ఫోన్లు ఇవే..

Satvika
ప్రస్తుతం యువత మొబైల్ ఫోన్స్ కు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు ... అది నిజమే.. యువత ఆలోచనలకు అందని విధంగా అద్భుతమైన ఫీచర్లతో పాటుగా అదిరిపోయే లుక్ తో పాటుగా స్టైల్, కలర్ ఇవన్నీ కూడా యువతను ఆకర్షిస్తున్న కొత్త ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. ఎప్పటికప్పుడు వాటికి డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. ఈ ఏడాది కరోనా కారణంగా చాలా మంది ఆన్ లైన్ లో కొత్త ఫోన్ల గురించి వేతికినట్లు తెలిపారు.. ఆ ఫోన్లు ఎంటో ఒక్కసారి ఇటు లుక్ వేసుకోండి...



ఐఫోన్ 12


ఈ ఫోన్ ధర రూ.79,999 నుంచి ప్రారంభం కానుంది. 5.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించారు. యాపిల్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక వెనకవైపు రెండు ప్రధాన కెమెరాల అందించనున్నారు.. ఒకటి 12 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉంటుంది. 


వన్ ప్లస్ 


ధర రూ.24,999 నుంచి ప్రారంభం కానుంది. 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ను ఇందులో అందించారు. ప్రధాన కెమెరా 48 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంటుంది.. 


ఒప్పో ఎఫ్17 ప్రో


ఈ ఫోన్ ధర రూ.21,490 నుంచి ప్రారంభం కానుంది. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ కూడా ఉంటుంది.


రెడ్ మీ 8 మరియు 8 ప్రో.. 

ఈ ఫోన్లను చాలా మంది వెతికారు...11,499 నుంచి ప్రారంభం కానుంది.. వెనుక వైపు నాలుగు కెమెరాలను అందించారు..48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. 


వీటితో పాటుగా, రియల్ మీ మొబైల్స్, రియల్ మీ ఫోన్లు 3, షియోమీ ఫోన్లు 3, వివో ఫోన్ 1, ఒప్పో ఫోన్ 1, ఐఫోన్ 1, వన్ ప్లస్ ఫోన్ 1 ఉన్నాయి.. ఒక్కో ఫోన్ ఒక్కో ప్రత్యేకత ను కలిగి ఉంటాయి.. జనవరిలో ఇంకా కొన్ని కొత్త ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: