ఫ్లయింగ్ కార్ గురించి ఎప్పుడైనా విన్నారా?
జనరల్ మోటార్స్( మంగళవారం) ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కాడిలాక్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. డ్రైవర్ లేకుండా స్వయంగా పైకి ఎగురుతుంది.అంతేకాకుండా కింద కూడా వస్తుంది. రోడ్లపై ఎగిరే ఈ కారు ప్రయాణికులకు విమానంలో ఎగురుతున్నమన్నా భావనను కలిగిస్తుంది.
అయితే కాడిలాక్ ఫ్లయింగ్ కారు లో ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు . చూడడానికి హెలికాప్టర్ లా, భూమి మీద నుండి నేరుగా పైకి టేకాఫ్ అవడంతోపాటు ల్యాండ్ కూడా అవుతుంది. ఫ్లయింగ్ కార్ కు ఏరోప్లేన్ లాగా లాండింగ్ విషయంలో పెద్దగా నిబంధనలు అంటూ ఏమీ ఉండవు.కేవలం ఎలికాప్టర్ లాగా ఎక్కడైనా భూమి మీది దిగగలదు. అలాగే టేకాఫ్ అవ్వగలదు. ఇక ఈ ఫ్లయింగ్ కార్ గంటకు 88.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ కారు పూర్తిగా సెల్ఫ్ ఆటోమేటెడ్ అండ్ ఎలక్ట్రిక్ వాహనం.
ఈ ఫ్లయింగ్ కారులో 90 కిలోవాట్ల మోటార్, జీ ఎమ్ అల్టీయం బ్యాటరీ బ్యాక్, ఎనిమిది రోటర్ లతో, లైట్ వెయిట్ బాడీని కలిగి ఉంటుంది. ఫ్లయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేరి బారా ప్రజంటేషన్ ద్వారా ఈ కాడిలాక్ ఫ్లయింగ్ కార్ ను పరిచయం చేశారు. అంతేకాకుండా త్వరలోనే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫ్లయింగ్ కార్లను కూడా అభివృద్ధి చేస్తామని జనరల్ మోటార్స్ అధికారులు చెప్పుకొచ్చారు.
ఫ్యూచరిస్టిక్ ఫ్లైయింగ్ కాడిలాక్ కి ముందు, వెనుక స్లైడింగ్ డోర్స్,పనోరమా మిక్ గ్లాసులు ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చాయి. క్యాబిన్లో రాప్ అరౌండ్ లాంజ్ వంటి సిట్టింగ్ లు ఏర్పరిచారు బయోమెట్రిక్ సెన్సార్లు, వాయిస్ కంట్రోల్, హ్యాండ్ సిగ్నల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.