వాట్సాప్ కొత్త పాలసీపై హైకోర్టు షాకింగ్ కామెంట్స్.. ఇష్టం లేకపోతే..
చాలా వరకు మొబైల్ యాప్‌ల నియమ నిబంధనలు ఇలానే ఉంటాయని, వాటిని గనుక ఓసారి చదివితే ఇలాంటి షరతులకు అంగీకరించామా? అని మనమే ఆశ్చర్యపోతామని కోర్టు పేర్కొంది. చివరకు గూగుల్ మ్యాప్స్ కూడా మన డేటా మొత్తాన్ని సేకరించి స్టోర్ చేస్తుందని కోర్టు వెల్లడించింది. పిటిషనర్ వేసిన లాసూట్ ప్రకారం, ఎలాంటి డేటా లీక్ అవుతుందన్న విషయం అర్థం కాలేదని, సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, సమయాభావం కారణంగా అలా చేయడానికి ఇప్పుడు కుదరదని, ఈ నెల 25 న పరిశీలిద్దామని చెప్పింది. కేంద్రం కూడా ఇందుకు అంగీకరించింది. సమస్యను విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
వాట్సాప్, ఫేస్బుక్ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీలు మాట్లాడుతూ.. పిటిషన్లో పస లేదని, అందులోని చాలా అంశాలకు ఎటువంటి ఆధారాలు లేవని విమర్శలు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగే ప్రైవేటు చాట్ మెసేజ్‌లు మాత్రం ఎన్‌క్రిప్ట్‌గానే ఉంటాయని, వాట్సాప్ వాటిని స్టోర్ చేయదని కోర్టుకు వివరణ ఇచ్చారు. కొత్త పాలసీలోనూ ఈ నిబంధనలు మారబోవన్నారు. కొత్త విధానం బిజినెస్ చాట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.