ఈ మధ్య ఎక్కువ మంది ఆన్ లైన్ లో ఏదోకటి వెతికినా కూడా డబ్బులు పోతున్నాయని వాపోతున్నారు.అందుకు కారణం కూడా లేకపోలేదు.. హ్యాకర్లు వారి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. ఢిల్లీలో పనిచేసే ఒక ఉద్యోగి కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ.80 వేలు పోగొట్టుకున్నాడు. కొరియర్ కంపెనీ
కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్‌లో సెర్చ్ చేయడమే దీనికి కారణం. గూగుల్‌లో
కస్టమర్‌కేర్ నంబర్లు సెర్చ్ చేయడం ఎంత ప్రమాదమో తెలియజేసే మరో సంఘటన ఇది.
విషయానికొస్తే.. ఓ వ్యక్తి తాను ఆర్డర్ చేసిన కొరియర్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆన్ లైన్
గూగుల్ సెర్చ్ చేశాడు. అక్కడ కనిపించిన నంబర్‌కు కాల్ చేశాడు. అతను కాల్ చేయగానే డీటీడీసీ ప్రొఫెషనల్ తరహాలో అవతలి వారు మాట్లాడారు. ధ్రువీకరణ కోసం వ్యక్తిగత వివరాలు తెలిపాలని కోరారు. వెంటనే పేరు, చిరునామా, కొరియర్ ఐడీ వంటివి నింపాలని కోరుతూ
గూగుల్ డాక్స్ ఫాంను పంపించారు. ఆ ఫాంను నింపిన అనంతరం త్వరగా సమస్య పరిష్కరించడం కోసం టీమ్‌వ్యూయర్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిందింగా కోరారు.
ఇలా కొత్త యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే సమాచారాన్ని త్వరగా చెరవెస్తామని నమ్మించారు. దీంతో అది నిజమే అని నమ్మిన అతను వాళ్ళు చెప్పినట్లే చేశారు. ఆ తర్వాత వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2 నగదు జమ చేయాల్సిందిగా కోరారు. ఒకవేళ కొరియర్ డెలివరీ కాకపోతే బుకింగ్ మొత్తాన్ని ఈ ఖాతాలోనే వేస్తామని తెలిపారు. ఇకపోతే డెబిట్ కార్డు ద్వారానే ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు వేచి చూడమని చెప్పారు.. కాగా మొదట 40 వేలు అతని ఖాతాలో నుంచి కట్ అయ్యాయి. ఈ విషయం అతను గుర్తించేలోపే మరో రూ.40 వేలు కూడా కట్ అయ్యాయి. వీరి దగ్గర అతని కార్డు వివరాలు ఉన్నాయి. టీమ్‌వ్యూయర్ యాప్ ద్వారా ఓటీపీ కూడా తెలుసుకున్నారు. దీంతో వారి పని మరింత సులభం అయింది. ఆన్ లైన్ ద్వారా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఎవరిని నమ్మకండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.