వాట్సాప్‌కు మరో కొత్త ప్రత్యామ్నాయం.. పేరేంటో తెలుసా?
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వ్యక్తిగత మెసేజ్‌లు చూడటం సాధ్యం కాదని వాట్సాప్, ఫేస్‌బుక్ చెప్తున్నాయి. అంతే కాదు కేవలం వాట్సాప్ బిజినెస్ ఖాతాల డేటాను మాత్రమే ఫేస్‌బుక్ తో పంచుకుంటామని, సాధారణ యూజర్ల డేటాను అస్సలు ముట్టుకోవడం జరగదని వాట్సాప్ హామీ కూడా ఇచ్చింది. అయినా సరే ప్రజలు మాత్రం ఈ మాటలు అస్పలు నమ్మడం లేదు.
‘వైర్ సెక్యూర్ మెసెంజర్’ ఓ కొత్త ఫ్రీ యాప్. ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఫోన్ నంబర్, పేరు ఇవ్వకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు. ‘వైర్’తో చాట్ చేసుకోవడంతో పాటు, ఇటు గ్రూపులుగా ఏర్పడి అటు మొబైల్, డెస్క్ టాప్‌పై కూడా యాప్ యాక్సెస్ చేయొచ్చు. 2014లోనే ఈ యాప్ వచ్చినా, ఇప్పటి వరకు దీనికి అంతగా పేరు రాలేదు. టెక్స్‌టింగ్, గ్రూప్ చాట్, వీడియో, ఆడియో కాల్, మెసేజ్ మాయం కావడం, స్టయులస్ సపోర్ట్‌తో చేత్తో రాసిన ఫైల్స్ పంపుకోవడం, వాయిస్ మెసేజ్‌స్, ఫైల్ షేరింగ్, పింగ్ చేయడం వంటి సదుపాయాలు అన్నీ వైర్ అందిస్తోంది.