" బుల్లిపిట్ట " మీరు రీచార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే చీపెస్ట్..బెస్ట్ ప్రీపెయిడ్ డేటా ప్లాన్స్ ఇవే..

Divya
ప్రముఖ టెలికాం దిగ్గజం సంస్థలైన రిలయన్స్ జియో,ఎయిర్ టెల్,వొడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం తక్కువ ధరకే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. వాయిస్ కాలింగ్,డేటా తోపాటు ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇక ఎవరైతే రోజుకు 2 జీ బీ  డేటా ఇంటర్నెట్ కావాలని కోరుకుంటున్నారో  వారి కోసం కొత్త డేటా ప్లాన్ పై 28 రోజుల వ్యాలిడిటీ తో అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లను యూజర్ల కోసం తీసుకువచ్చాయి టెలికాం సంస్థలు.


ఇటీవలే ఎయిర్టెల్ అమెజాన్ భాగస్వామ్యంతో కొత్త ప్లాన్ల పై ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఇక అలాగే వొడాఫోన్ ఐడియా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్ పై  Voot సెలెక్ట్ భాగస్వామ్యంతో ఓ టీ టీ బెనిఫిట్స్ ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ మూడు టెలికామ్ దిగ్గజ సంస్థలు కేవలం 250 రూపాయల లోపే అందించే బెస్ట్ డేటా ప్లాన్ లలో ఏ ప్లాన్ లో డైలీ డేటా,వాయిస్ కాలింగ్,స్ట్రీమింగ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం

ఎయిర్ టెల్ :రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్:
ఎయిర్ టెల్ అందించే ఈ ప్లాన్ కింద రోజూ  1జీ బీ డేటా తోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంది. 24 రోజులు వ్యాలిడిటీ తో 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. దీనికి అదనంగా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ని కూడా పొందవచ్చు. అలాగే ఎయిర్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం కూడా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. ఇంకా Wynk  మ్యూజిక్, shaw అకాడమి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఎయిర్ టెల్ : రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్:
ఇక ఈ ప్లానింగ్ కి కూడా ఆ రోజుకు 1జీబీ డేటా తోపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ ఎం ఎస్ లు, ఇంకా ఎన్నో డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

ఎయిర్ టెల్ :రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్:
ఇక ఈ ప్లాన్ కింద 1.5 జీబీ డేటా తోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అలాగే ఉచితంగా హలో ట్యూన్స్ తో పాటు FASTag ట్రాన్సాక్షన్ చేస్తే 150 రూపాయలు వరకు క్యాష్ బ్యాక్  కూడా పొందవచ్చు.


రిలయన్స్ జియో: రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ కింద 28 రోజులు వ్యాలిడిటీ తో పాటు 28 జీ బీ  డేటా,అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్,300 ఎస్ ఎం ఎస్ లు పొందవచ్చు.  అలాగే కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కింద జియో యాప్స్ ని  కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో: రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్:
ఇక ఈ ప్లాన్ కింద 28 రోజులు వ్యాలిడిటీ, 42 జీ బీ  డేటా తో పాటు రోజుకు 1.5 జీబీ డేటా ను పొందవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఉచితంగా పొందడంతో పాటు జియో యాప్స్  కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

జియో :రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ కింద డైలీ 2 జీబీ  డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 28 రోజుల్లో వ్యాలిడిటీ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కింద జియో యాప్స్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.


వోడాఫోన్ ఐడియా : రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీ రోజుకు 1జీబీ  డేటా ను పొందవచ్చు, రూ.125 ప్లాన్ కింద మొబైల్ ప్రీమియర్ లీగ్ ఫేవరెట్ గేమ్స్ ను  యాక్సెస్ చేసుకోవడంతో పాటు అలాగే బోనస్ క్యాష్ బ్యాక్  కూడా అందుతుంది. జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి రోజుకు 75 రూపాయల వరకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వోడాఫోన్ ఐడియా మూవీస్, టీవీ టీవీ షోలను కూడా Voot select ఓ టీ టీ నుంచి స్ట్రీమింగ్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: