ఒక్కొక్కరికి ఒక్కొకటి అయితే చాలా ఇష్టం.. అందుకోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు.. తమ ఇష్టం కోసం ఏదైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. జనాల మనసు దోచుకున్న వాటిలో ఒకటి మ్యూజిక్. కొన్ని రకాల మ్యూజిక్ మనుషులకు ప్రశాంతతను అందిస్తాయి. అందుకే కొందరు సంగీతం అంటే చెవులు కోసుకుంటారు. భారతదేశం లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు బాగా డిమాండ్ పెరిగింది.. పని చేసుకుంటూ గానీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ గాని నిరంతరం పాటలు వినడం చాలామందికి అలవాటు..
ఇప్పటివరకు మాటలను బట్టి మూడ్ ఆధారంగా పాటల ఎంపిక లేదు.. తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటి ఫై టెక్నాలజీకి పేటెంట్ రైట్స్ పొందింది.. ఈ కొత్త టెక్నాలజీ మీ ఎమోషన్ బట్టి వాయిస్ టోన్ ఆధారంగా అదే పాటలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు. ఏదైనా మాట్లాడుతుంటే మన మూడ్ ఆధారంగా పాటను ఎంపిక చేస్తుంది.ఒక మనిషి మాట్లాడే భావోద్వేగ స్థితిని గుర్తించి , మాటల శబ్దం ఆధారంగా ఆమె ఒత్తిడి లో ఉందా.. ఆందోళనలో ఉందా.. అని పసిగట్టే స్తోంది. మాట్లాడే విధానంలో తేడాలు , ఇష్టాలను గుర్తించే విధంగా ఈ టెక్నాలజీ ను తయారు చేశారు.
ఈ టెక్నాలజీ కోసం పేటెంట్ ను కూడా సొంతం చేసుకుంది. స్పాటి ఫై స్ట్రీమింగ్ కంపెనీ 2018 లో ఈ టెక్నాలజీ పేటెంట్ కోసం ఫిబ్రవరిలో ఫైల్ చేసింది. 2021లో ఈ టెక్నాలజీకి మంజూరు అయిందని మ్యూజిక్ కంపెనీ వెల్లడించింది. ఇలాంటి ఒక టెక్నాలజీ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ తీసుకురావడం పై మ్యూజిక్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పాటి ఫై స్ట్రీమింగ్ కంపెనీ జనాల ముందుకు రావడానికి మూడేళ్లు పట్టింది. అందరికీ నచ్చడంతో ఈ యాప్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. యాప్ కు మంచి టాక్ కూడా నడుస్తుంది..