రెడ్ మీ కే40 ఫోన్ త్వరలోనే లాంఛ్..స్పెషల్ ఫీచర్స్ ఇవే..!

Satvika
ప్రముఖ మొబైల్ కంపెనీలలో ఒకటి రెడ్ మీ.. ఈ కంపెనీ ఇప్పటివరకు ఎన్నో ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. మొన్నామధ్య పండగ సీజన్ సమయంలో కూడా కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఆ ఫోన్ విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ తో పాటుగా మంచి డిమాండ్ కు అందుకుంది.ఇప్పుడు సరికొత్త లుక్ , ఫీచర్స్ తో ఉన్న మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఆ ఫోన్ఎంటో , ఫీచర్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 


రెడ్ మీ కే40 లాంచ్‌ను షియోమీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ఫిబ్రవరి 25వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ కానుందని గతంలో షియోమీ టీజ్ చేసింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.కే40 ఫిబ్రవరి 25వ తేదీన లాంచ్ కానుందని చెప్పడం తప్ప, ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి వివరాలు తెలపలేదు. రెడ్ మీ కే40 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కూడా కంపెనీ రూపొందిస్తుందని, అతి త్వరలోనే ఆ ఫోన్ కూడా మార్కెట్ లోకి త్వరలోనే రానుంది. 



ఈ సరికొత్త కే40 సిరీస్ మూడు వేర్వేరు ప్రాసెసర్లతో లాంచ్ కానుందని తెలుస్తోంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888, స్నాప్ డ్రాగన్ 870, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్లతో ఇందులో వేర్వేరు వేరియంట్లు రానున్నట్లు సమాచారం. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో 5జీ సపోర్ట్ కూడా ఉండనుందట..బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 10.5 గంటలు ఉపయోగించాక కూడా ఇందులో 64 శాతం బ్యాటరీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మరి కెమెరా తదితర వివరాల గురించి కంపెనీ చెప్పలేదు. ధర కూడా ఒక్కో యాంగిల్ ఫోన్ కు ఒక ధర ఉంటుంది. త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఈ ఫోన్ కి ఇప్పటి నుంచే డిమాండ్ భారీగా పెరిగనుందని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: