"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..
ప్రస్తుత కాలంలో వేగవంతంగా మారుతున్న టెక్నాలజీకి, అనుగుణంగా స్మార్ట్ ఫోన్ తయారీలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పోటీ పెరగడంతో, ఫీచర్లతో, ఇంకొత్త మార్గాలతో వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఇక ఈ పోటీ లోనే చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ షావోమి ముందు వరుసలో నిలుస్తోంది.ఇక ఈ క్రమంలోనే తాజాగా సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులను ఆకర్షించడానికి మరొక అడుగు ముందుకు వేసింది.
సాధారణంగా మొబైల్ ఛార్జింగ్ చేయాలంటే,ఎంత లేదన్నా ఒక గంట పాటు సమయం పడుతుంది. ఈ సమయాన్ని తగ్గించడానికి,ఎన్నో మొబైల్ కంపెనీ తయారీ సంస్థలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి, ఆ సమయాన్ని తగ్గిస్తున్నాయి. ఇక అదే బాటలోనే షావోమి సరికొత్తగా ప్లాన్ చేసింది. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కంపెనీలు వినూత్న సాంకేతిక తీసుకొస్తుంటే, ఇక షావోమీ కంపెనీ కూడా తమ మొబైల్ ఫోన్ వేగంగా ఛార్జింగ్ చేసుకొనే,సాంకేతికను తీసుకొచ్చింది. ఇందులో 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.
ఈ సరికొత్త టెక్నాలజీతో మొబైల్ ఫోన్లో కేవలం పది నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయొచ్చట. ప్రస్తుతం బిల్డింగ్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని, ఈ సంవత్సరంలోనే తీసుకురానున్నారు అని సమాచారం. ఇక అంతే కాకుండా ఎంఐ పోర్టబుల్ పేరుతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చే ఆలోచనలు షావోమీ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొబైల్ తోనే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
ఇక ఈ టెక్నాలజీకి సంబంధించిన మరింత సమాచారం పై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ తక్కువ సమయంలోనే, ఫుల్ బ్యాటరీ చార్జింగ్ మొబైల్ ఈ సంవత్సరంలోనే రాబోతున్నందుకు మనం ఎంతో ఆనంద పడాల్సిన విషయం. దీనివల్ల మన సమయం చాలా సేవ్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇకపై ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన రోజులు పోయాయి. కేవలం పది నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ తో బయటకు వెళ్లే రోజులు వచ్చేసాయి.