సెల్ఫీ ప్రియులకు ఈ రెండు ఫోన్లు సరిగ్గా సరిపోతాయి..అవే..!!

Satvika
ఈ మధ్య యువత ఫోన్లను కొంటుంది ఫోటోల కోసమే అని తెలుస్తుంది.. వారి అభిప్రాయాలకు తగ్గట్లే ఆయా మొబైల్ కంపెనీలు కూడా కొత్త ఫీచర్లతో ఉన్న వాటిని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల ఫోన్లు బయటకు వచ్చాయి. ఆ ఫోన్లు అన్నీ మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. ఇప్పుడు ప్రముఖ మొబైల్ కంపెనీ లు అయిన వన్ ప్లస్, శాంసంగ్ ఫోన్లు కొత్త కెమెరాల తో ఫోన్లను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.



ఇందులో భాగంగా పంచ్‌ హోల్, నాచ్‌ డిస్‌ప్లేకు గుడ్‌బై చెప్పనున్నాయని సమాచారం. ఇప్పటి వరకు సెల్ఫీ కెమెరాల కోసం ఫోన్‌ డిస్‌ప్లే పై భాగంలో చిన్న హోల్ ఇచ్చేవారు. దీని వల్ల డిస్‌ప్లే క్వాలిటీని పూర్తి స్థాయిలో యూజర్స్‌ ఆస్వాదించ లేకపోతున్నారట. అందుకని సెల్ఫీ కెమెరా కోసం సరికొత్త డిజైన్ ఆవిష్కరించనుంది వన్‌ప్లస్‌. ఇందులో భాగంగా సెల్ఫీ కెమెరాని ఫోన్ పైభాగంలో చిట్ట చివరన ఏర్పాటు చేయనున్నారట.. ఇటీవలే ఈ విషయం బయట హల్ చల్ చేస్తుంది.


వన్‌ప్లస్‌ తరహాలోనే శాంసంగ్ కూడా కొత్త ఫోన్ కెమెరా అనుభూతిని యూజర్స్‌కి అందివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పాప్‌-అప్‌, రొటేషన్ కెమెరాను తీసుకురానుందట. దీనికి సబంధించిన కొన్ని ఫొటోలను కంటెంట్ క్రియేటర్ అనే వెబ్‌సైట్ షేర్ చేసింది. ఇందులో ఫోన్ వెనక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ కెమెరా కోసం క్లిక్ చేసినప్పుడు ఫోన్ వెనక వైపున ఉన్న కెమెరా బార్ పైకి జరిగి ముందు వైపుకి తిరిగి సెల్ఫీ కెమెరాలా పనిచేస్తుందట..కాగా ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ప్రయోగం లో ఉంది.. మరి కొన్ని రోజుల్లో ఈ టెక్నాలజీ అన్నీ ఫోన్లకు రానుందని సమాచారం.. ఈ వార్త నిజంగానే సెల్ఫీ ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఈ ఫోన్లు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయి అన్నది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: