థైరాయిడ్ సమస్య తో బరువు తగ్గుతారా..?

sravani
థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపి, శారీరక క్రియలను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి పని తీరులో తేడాల వల్ల హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి.థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్‌ను విడుదల చేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఎక్కువగా విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. వీటి లక్షణాలేంటి, ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఏ ఆహారం తీసుకోవద్దు. గర్భిణులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు వాపు కనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చిరాగ్గా ఉంటుంది. చెమట పట్టడం, బరువు తగ్గడం, జుట్టు రాలడం లాంటి లక్షణాలు ఉంటాయి. వయసు బట్టి చికిత్స అందిస్తారు. చిన్న వయస్కులకు యాంటి థైరాయిడ్‌ మందులు వాడతారు. 45 ఏళ్ల లోపు వారికి అవసరాన్ని బట్టి ఆపరేషన్‌ చేయాల్సి రావచ్చు.అంతర్లీనంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి, శరీరంలో జీవక్రియలు జరిగే పనితీరు బలహీనపడుతుంది. మన జీవక్రియ వ్యవస్థ అనేది శరీర పనితీరును ప్రభావితం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాక వివిధ జీవక్రియల్లో భాగంగా తీసుకున్న ఆహారంలోని కేలరీలను కరిగించే విధానాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందువల్ల మీకు కూడా జీవక్రియల్లో సమస్యలు ఉన్నాయని అనిపించినా, లేదా నెమ్మదిగా జీవక్రియ రేటు ఉంటున్నా, మీ శరీర బరువు పెరుగుతుంది.

దేహంలోని అదనపు బరువును తగ్గించుకోవడం మీకు కష్టతరమవుతుంది.నెమ్మదిగా జరిగే జీవక్రియల కారణంగా రక్తపోటు మరియు కొలెస్ట్రాల్, ఉదరంలో సమస్యలు రావడంతో పాటు అదనపు ఆరోగ్య ప్రమాదాలు కూడా వచ్చే అవకాశముంది. అందువల్ల, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆహారాన్ని సమతుల్యం చేసుకోవడం మరియు థైరాయిడ్ సమస్యలను సరిదిద్దుకోవడం చాలా అవసరం. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు థైరాయిడ్ రోగ నిర్ధారణ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొందరిలో రోగ నిర్ధారణ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఈ వ్యాధి కారణంగా రోగి ఎక్కువ బరువు కూడా పెరగవచ్చు.మనం తీసుకునే నాణ్యమైన ఆహారం హార్మోన్ల పనితీరును నియంత్రించగలదు మరియు థైరాయిడ్ పరిస్థితిని సమన్వయం చేయడానికి సహాయపడుతుంది, అయితే ఆహారం మాత్రమే హైపోథైరాయిడిజమ్‌ సమస్యను నయం చేయలేదని మనం గమనించాలి. అయినప్పటికీ, సరైన పోషకాహారం, వ్యాయామం మరియు ఔషధాలను క్రమంగా తీసుకోవడం వలన, నిపుణుల సూచన మేరకు సరైన ఆహారాన్ని తినడం వల్ల హైపోథైరాయిడిజం నయం అవుతుంది.

థైరాయిడ్ రోగులు ఫైబర్ పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు క్రమంగా తగ్గుతారు. ఫైబర్ జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. దేహంలో ఏర్పడ్డ చెడు పదార్థాలను తొలగించడాన్ని ఫైబర్ వేగవంతం చేస్తుంది. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు పుష్కలంగా తీసుకుంటే థైరాయిడ్ సమస్య నివారణ జరుగుతుంది.
సెలీనియం శరీరానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను పుష్కలంగా ఉత్పత్తి చేయడంలో సహాయపడే ముఖ్యమైన ఖనిజాలవణం. ఆహారంలో తగినంత సెలీనియం తీసుకుంటే అది దేహంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్, బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సెలీనియం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును కూడా బలపరుస్తుందని సూచించాయి. అందువల్ల థైరాయిడ్ సమస్యలున్నవారు సెలీనియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమైన సలహా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: