బుల్లిపిట్ట : పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడం ఎలానో తెలుసా..?
ఆధార్ కార్డ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమే. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి బ్యాంకు ఖాతాల నిర్వహణ వరకు మీకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఇల్లు,స్థలం కొన్నా, చివరకు బైక్ కొనాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. మరి అప్పుడే పుట్టిన పిల్లలకు సంగతేంటి? వాళ్లకు ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలి? అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందాలంటే ఏం చేయాలి? ఏ విధమైనటువంటి సర్టిఫికెట్ అవసరం అవుతుంది..? అనే విషయాలు చాలామందికి తెలియదు. అలాంటి వారి కోసమే ఈ విషయాలు.
శిశువు పుట్టిన రోజు తొలి రోజు నుంచి ఆధార్ కార్డు ను పొందవచ్చు. ఈ విషయాన్ని ఇటీవల యుఐడిఎఐ ద్వారా తెలిపింది. ఇందుకోసం జనన ధ్రువీకరణ పత్రం అవసరం అవుతుంది. దీనిని డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అంటారు. ఈ సర్టిఫికెట్ను పిల్లలు పుట్టిన ఆసుపత్రిలోనే ఇస్తారు. కొన్ని హాస్పిటల్ లో డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తోపాటు ఆధార్ ఎన్రోల్మెంట్ దరఖాస్తు పత్రాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే మీ పిల్లలకు కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయాలి అంటే కింద ఇచ్చిన సూచనలను పాటించండి.
5 ఏళ్ల తర్వాత ఎలా అప్లై చేయాలి:
1). ఐదేళ్లలోపు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్ లాంటివి మార్పు చేయరు. కాకపోతే ఆధార్ వివరాలు అప్డేట్ కోసం తల్లిదండ్రులు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
2). పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు తో పాటు పిల్లలు స్కూల్ ఐడెంటిఫికేషన్ కార్డు దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.
3). ఈసారి పిల్లల నుంచి వేలిముద్రలు ' ఐరిష్ స్కాన్ సేకరిస్తారు .పిల్లల 15 ఏళ్ళు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటాను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.
ఎలా ఎన్రోల్ చేసుకోవాలో చూద్దాం..
1.మొదట యూఐడీఏఐ వెబ్సైట్ (https:/uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)
ఓపెన్ చేసి గెట్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
2.ఆ తర్వాత బుక్ అపాయింట్మెంట్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
3.మొదట శిశువు పేరు, తల్లిదండ్రుల్లో ఒకరి ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి వివరాలు నమోదు చేయాలి.
4.వ్యక్తిగత వివరాలు తర్వాత ఇంటి అడ్రస్సు దరఖాస్తు ఆన్లైన్లో నింపాలి. తర్వాత ఫిక్స్ అపాయింట్మెంట్ బటన్పై క్లిక్ చేసి బుకింగ్ తేదీ సమయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
5. అపాయింట్మెంట్ బుక్ అయిన తర్వాత సమయానికి మనం ఎంచుకున్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఈసేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
6.కావాల్సిన డాక్యుమెంట్ తో పాటూ అప్పోయింట్మెంట్ లెటర్ ప్రింట్ అవుట్ కూడా ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
7.ఆ సర్టిఫికెట్స్ అన్నింటినీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వివరాలు ఎన్రోల్ చేసుకుంటారు. పిల్లల వయసు 5 ఏళ్ళు దాటితే బయోమెట్రిక్ డేటాను సేకరిస్తారు.
8.ఎన్రోల్మెంట్ పూర్తి అయిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ని ఇస్తారు. ఈ నెంబర్ సహాయంతో ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
9. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మొబైల్ కు యుఐడీఏఐ నుంచి ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన రోజు ఆధార్ కార్డు ఇంటి అడ్రస్ కు వస్తుంది. అవసరమనుకుంటే యుఐడిఎఐ వెబ్సైట్ నుంచి కూడా ఆధార్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.