వన్ ప్లస్ 9 సీరీస్ ఫోన్ ఫీచర్లు అదరహో.. ధర కూడా తక్కువే...

Satvika
టాప్ మొబైల్ బ్రాండ్లల్లో ఒకటి వన్ ప్లస్.. యాపిల్ ఫోన్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఫోన్ల నుంచి ఇప్పటికీ ఎన్నో ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అయి సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరొక ఫోన్ లాంఛ్ కానుంది. వన్ ప్లస్ 9 సిరీస్ లోంచి తక్కువ ధరలో వచ్చినా కూడా వేగవంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్, బెస్ట్ కెమెరా ఫీచర్లు మరియు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది.

వన్ ప్లస్ 9R : ధర

వన్ ప్లస్ 9R (8జీబీ + 128 జీబీ ) : రూ.39,999

వన్ ప్లస్ 9R (8జీబీ + 128 జీబీ ) : రూ.43,999

వన్ ప్లస్ 9R : ప్రత్యేకతలు

ఈ 9R స్మార్ట్ ఫోన్ 6.55 -అంగుళాల ఫుల్ హెచ్. డీ ప్లస్ +రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన ఎడమ వైపున పంచ్ హోల్ డిజైన్ ని అందించిందన్న విషయం అందరికి తెలిసిందే.. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 650 జిపియు తో పనిచేస్తుంది..వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. అయితే ఈ కెమెరాలు అద్భుతాలను చేయగలవు.


16ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP మాక్రో మరియు 2 ఎంపి మోనో క్రోమ్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16ఎంపి సెల్ఫీ కెమెరాని సోనీ సెన్సార్ తో అందించింది.ఇక పోతే.. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,  సౌండ్ టెక్నాలజీతో వస్త్తుంది. ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 65 వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ ను 1% నుండి 100% నింపడానికి కేవలం 39 నిముషాల సమయం మాత్రమే.. ఏది ఏమైనా కూడా ఈ ఫోన్ కు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: