ఏసి ను కొనాలనుకుంటున్నారా.. ఇది చూడండి..

Satvika

సమ్మర్ వచ్చిందంటే అందరూ కూడా ఏసి, కూలర్ కొనాలని భావనలో ఉంటారు.. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే వాటిని నాణ్యత పరిమాణాలు చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి. ఆన్లైన్లోనే ఏసీలు, ఇతర వస్తువులు కొంటుంటారు. ఆఫర్లు అధికంగా ఉండడం, ఇంటికి డెలివరీ చేయడం తదితర అంశాలే ఇందుకు కారణం. అయితే ఏదో ఒకటి చూసి బుక్ చేసుకోవడం కంటే కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని ఏసీని బుక్ చేసుకోవడం మంచిది.


 అందుకే, మనకు ఏసీని ఏళ్ల తరబడి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చు. ఏసీని కొనే ముందు కేవలం కంపెనీని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.డీలర్ల వద్ద ధరను చెక్ చేసి పోల్చి చూడాలి. వివిధ ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్లలోనూ ధరను పోల్చి చూడాలి. ఒరిజినల్ ధర ఎంత ఉంది? ఎంత మేర డిస్కౌంట్ అందిస్తున్నారు? తదితర వివరాలను చెక్ చేసుకోవాలి. అప్పుడే నాణ్యమైన ఏసి లను పొందవచ్చు..


అన్నిటికన్నా ముఖ్యమైనది వీటిని కొనేముందు నాణ్యత ను చెక్ చేసుకోవాలి . వారంటీని తనిఖీ చేసుకోవాలి. సాధారణంగా ప్రొడక్ట్ పై ఏడాది, కండెన్సర్ పై ఏడాది, కంప్రెసర్ పై ఐదేళ్ల వారెంటీ ఉంటుంది. ఏసీ కొనే ముందు ఈ వివరాలను తెలుసుకోవడంతో పాటు ఇతర సాధారణంగా ఏసీ వాడితే వేలకు వేలు కరెంట్ బిల్ వస్తుంది. ఇన్వర్టర్ ఏసీలు మోటార్ స్పీడ్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఇలాంటి ఏసీలకు పవర్ బిల్ తక్కువగా వస్తుంది.ఏసీలో ఎయిర్ ఫ్లోపై మన కంఫర్ట్ ఆధారపడి ఉంటుంది. కొన్ని ఏసీలు చాలా దూరం వరకు గాలిని ఫ్లో చేస్తాయి. ఏసీ కొనే సమయంలో ఈ విషయాన్ని గమనించాలి. ఏ కంపెనీ ఏసి బెస్ట్ అనే క్షుణ్ణంగా పరిశీలించి, అప్పుడే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: