బుల్లిపిట్ట : మీకు వాహనం రివర్స్ గేర్ లో నడపడం వచ్చా..? అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకో గూడ్ న్యూస్..!
ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ ఏదో ఒకటి నడపడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి అవసరానికి అనుగుణం గా వాడుకోవాల్సి ఉంటుంది ఈ వాహనాలను. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుగా వాహనం నడపడం రావాలి. కారు గాని ఇతర వాహనాలు నడపడం వస్తే చాలు ఆర్టిఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చే విధానం లో కొంత కష్టం గానే ఉంటుందని చెప్పవచ్చు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే తప్పకుండా అది వచ్చి ఉండాలని తేల్చిచెప్పింది. అదేమిటో కాదండోయ్ రివర్స్ గేర్ లో వెహికల్ నడపాల్సి ఉంటుంది. అది కూడా సరిగ్గా నడపాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు అయిన లైసెన్స్ రావడం కష్టమే. ఈ విషయాన్ని రోడ్డు మంత్రిత్వ శాఖ నిబంధనలు విధిస్తూ లైసెన్సులు జారీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ను వెహికల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పలు అంశాలను ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా పలు సర్వీసులు ఆన్లైన్లో పొందవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఇలా కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిబంధనలను విధించేందుకు సిద్ధమవుతోందని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ లో పలు నిబంధనలను అమలు చేస్తోంది. మళ్లీ కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం . ఇది కాక డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ లో కూడా అక్రమాలు చోటు చేసుకుంటూ ఉండడంతో, కేంద్రం చర్యలకు దిగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇస్టరీతిన లైసెన్సులను ఇస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ కఠినతరం చేస్తోంది. కాబట్టి ఇక పై డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి తప్పకుండా రివర్స్ గేర్ లో వాహనాలను నడపడం తెలిసి ఉండాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో డ్రైవర్ కొలువులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.