బుల్లిపిట్ట : వాట్సాప్ సరికొత్త ఫీచర్.. బీటా యూజర్లకు సర్ప్రైజ్..!

Divya

వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను  అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే గతేడాది వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజ్ అనే ఒక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ ఫీచర్ వల్ల  మీరు పంపిన మెసేజ్ లు  వారం రోజుల తర్వాత ఆటోమేటిక్  గా డిలీట్ అయ్యేవి. అయితే ఇప్పుడు వాట్సాప్ ఇంకాస్త ముందడుగు వేసింది. దాని వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్ తీసుకొచ్చిన మరొక ఫీచర్ ఏమిటంటే ..మీరు పంపిన మెసేజ్ లు, కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే డిలీట్ అవ్వనున్నాయి. అంటే ఏడు రోజుల నుంచి ఇరవై నాలుగు గంటలకు తగ్గించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.. ఇదిలా ఉండగా వాట్సప్ ఇటీవల ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇబ్బందులను ఎదుర్కోలేక దీంతో చాలా మంది యూజర్లు టెలిగ్రామ్ వంటి ఇతర ప్లాట్ ఫామ్ లకు మారుతున్నారు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని, వాట్సాప్ తమ యూజర్లను చేజారకుండా ఉండేందుకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది..


ఇక ఇందులో భాగంగానే ఈ ఫీచర్ లో మీరు పంపిన మెసేజ్ లు వారం రోజుల తర్వాత ఆటోమేటిక్ గా  డిలీట్ అయితే, ఇప్పుడు ఈ సమయాన్ని 24 గంటలకు కుదించేందుకు ప్రయత్నం చేస్తోంది వాట్సాప్.. అయితే ఇప్పుడు వాట్సప్ తీసుకొచ్చిన సరి కొత్త లో యూజర్లకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి .అందులో ఏడు రోజులు ,24 గంటలు, ఇందులో ఏది కాదు.. ఇక ఈ మూడు ఆప్షన్ల తో మనకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వారికి కావలసిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మెసేజ్ లను 24 గంటలు అనే ఆప్షన్ ను  ఎంచుకున్నప్పుడు , వాట్సాప్ మెసేజ్ లు  24 గంటల్లో నే ఆటోమేటిక్ గా  డిలీట్ అవుతాయి.

ముఖ్యంగా ఈ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ లేదా డెస్క్ వర్షన్లలో వాట్సాప్  పరీక్షిస్తున్నట్లు తెలిపింది.. దీనివల్ల యూజర్లు తమ వ్యక్తిగత రహస్యాలను మరింత గోప్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది . ఇక అంతేకాకుండా దీని ద్వారా డివైస్ స్టోరేజీ  సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది .అయితే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉందని WABetainfo స్పష్టం చేసింది. అయితే రానున్న మరికొద్ది రోజుల్లోనే యూజర్లకు ఈ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా తెలిపింది.

 అయితే ఈ ఫీచర్ వల్ల కొంత నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ముఖ్యమైన మెసేజ్ లను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకోసమే ఈ ఫీచర్ లో టైమర్ అనే ఆప్షన్ సెట్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది ఇక దీనికి అనుగుణంగా టైమ్ వాట్సాప్ కోసం పరీక్షలు కూడా నిర్వహిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: