యాపిల్ వస్తువులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆ బ్రాండ్ కున్న పేరే అలాంటిది. సరికొత్త ఫీచర్ల తో పాటుగా ఆకట్టుకునే అందంతో ఉన్న స్మార్ట్ ఫోన్లను, లాప్ ట్యాప్ లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఇకపోతే గత కొంత కాలంగా స్మార్ట్ వాచ్ తయారీలోకి కూడా కాలుపెట్టింది. ఈ ఏడాదిలో విడుదల కానున్న వాచ్ ల ఫీచర్లు తాజాగా ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.
యాపిల్ వాచ్ సిరీస్ 7 రెండర్లు, డిజైన్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. చూడటానికి ఈ వాచ్ అన్నివైపులా ఫ్లాట్‌గా ఉంది. కొత్త మింట్ గ్రీన్ రంగులో కూడా ఈ వాచ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.ఇప్పుడు దీనికి సంబంధించిన రెండర్లు లీకవడంతో దీని లుక్ ఆన్‌లైన్‌లో లీకైంది. వీటిలో దీని డిజైన్‌ను చూడవచ్చు. ఈ వాచ్ అన్ని వైపులా ఫ్లాట్‌గా ఉంది.ప్రముఖ టిప్‌స్టర్ జాన్ ప్రోసర్ దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.
ఇందులో యాపిల్ వాచ్ సిరీస్ 7ను అన్ని వైపుల నుంచి చూడవచ్చు. ఈ వాచ్ పక్కభాగంలో కూడా ఫ్లాట్‌గానే ఉంది. దీని రెండర్ల ప్రకారం ఈ వాచ్ డిస్‌ప్లే కూడా ఫ్లాట్‌గానే ఉంది. ఇంతకుముందు వచ్చిన వాచ్‌లు పక్కభాగంలో వంపు తిరిగి ఉండేవి. సిల్వర్, బ్లూ, బ్లాక్, రెడ్ రంగుల్లో లాంచ్ అవుతుంది. కానీ ఈ వాచ్ మాత్రం కొత్తగా మింట్ గ్రీన్ కలర్‌లో కనిపించింది. దీని స్ట్రాప్ రంగు మింట్ గ్రీన్‌లా ఉండటంతో పాటు వాచ్ మెటాలిక్ అంచులు కూడా కాస్త ఆ రంగులోనే ఉన్నాయి... వీటి ధర మాత్రం కంపెనీ పేర్కొనలేదు. ఇకపోతే అయితే యాపిల్ వాచ్ కొత్త రెండర్ల డిజైన్ ఐఫోన్ 12 సిరీస్ డిజైన్‌లా ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ డిజైన్లు కూడా ఇలానే ఉంటాయని వార్తలు వస్తున్నాయి.మరి వాటి ఫీచర్లు ఇంకెంత అడ్వాన్స్ గా ఉంటాయో చూడాలి..