బుల్లి పిట్ట : ఇకపై ఇంటి నుంచే ఆధార్ సేవలు..
దేశవ్యాప్తంగా అత్యుత్తమమైన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు లేకుండా ఎలాంటి పనులు కూడా జరగవు. అంత ప్రాధాన్యం కాబట్టి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. రేషన్ కార్డు నుంచి ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ వరకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండి తీరాల్సిందే. ఇలాంటి ఆధార్ కార్డులో ఒక్కొక్కసారి మన పేరు, బర్త్ డేట్ ఇతర విషయాలు కొన్ని సార్లు తప్పులుగా వస్తుంటాయి. అయితే ఇలాంటివి సరిదిద్దుకోవాలంటే చాలా కష్టతరంగా వుండేది. కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టేందుకు uidai ఒక కొత్త వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా ఆధార్ కార్డులో ఉన్న పేరును మార్చుకోవాలి అంటే, ssup.uidai.gov.in వెబ్ సైట్ కు వెళ్లాలి. ఇక ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత క్యాప్చా ను ఎంటర్ చేసి , వాటిపై క్లిక్ చేసిన తర్వాత ,మీ ఆధార్ నెంబర్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అక్కడ అడిగిన విధంగా మీరు మీ పేరు అప్డేట్ చేసిన తర్వాత , మీ ఓటర్ కార్డు, రేషన్ కార్డు ,పాన్ కార్డు లాంటివి ఏదో ఒక ఐడిని ప్రూఫ్ గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు మీ నంబర్ కి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేస్తే పేరు మారుతుంది. ఇక వీటిలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చుకోవచ్చు.
ఇక అలాగే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ను కూడా మార్చుకోవాలి అంటే , పైన చూపించిన వెబ్సైట్ కి వెళ్లి, అందులో లో పేరు మార్చుకోవడానికి ఏ పద్ధతి ఉపయోగించారో , దీనికి కూడా సేమ్ పద్ధతి ఉపయోగించి, కొత్త అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే, కొత్త అడ్రస్ అప్డేట్ అవుతుంది.