బుల్లి పిట్ట: రైళ్ళల్లో సరికొత్త ఫీచర్.. నిద్రపోయినా కూడా తట్టి లేపుతుంది..

Divya

ఫ్యామిలీలతో మనమందరం దూరప్రయాణాలు చేయాలంటే ఎక్కువగా రైల్లో ప్రయాణిస్తుంటాము. ఒకవేళ బోర్ కొట్టి నిద్రపోవాలి అనిపిస్తే నిద్రపోతాము.. అలా పడుకున్నప్పుడు మన గమ్యం చేరువ అయితే ఎలా ? ఒక్కొక్కసారి కొంతమంది అలా గమ్యం మిస్ అవుతున్నామని , అనుకోకుండా నిద్ర వచ్చి నిద్ర పోయాము అంటూ వాపోతున్నారు.. అయితే అలాంటి వారికి రైల్వే సంస్థ ఒక కొత్త సేవలను ప్రారంభించింది. ఆ సేవ ఏంటి ? అది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం.

ఇక మీదట రైల్లో ఎలాంటి ఆందోళన లేకుండా నిద్ర పోవచ్చు.. ఎందుకంటే మీ గమ్యం దగ్గరికి రాబోతున్నప్పుడు రైల్వే సంస్థ నుండి మీకు ఒక కాల్ వస్తుంది. దీని ద్వారా మీరు మేల్కొంటారు. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు.. కేవలం 139 అనే నెంబర్ కు  కాల్ చేసి, మీ పి ఎన్ ఆర్ లో వేకప్ కాల్-డెస్టినేషన్ హెచ్చరిక సౌకర్యం కోసం నమోదు చేయించుకోవాలి.
ఇది రాత్రి సమయంలో ఎక్కువ గా నిద్ర పోయే వారికి బాగా ఉపయోగపడుతుందని రైల్వే వేకప్ కాల్ - డెస్టినేషన్ అనే సేవలు ప్రారంభించింది. ఈ సేవ ద్వారా కొద్దిగా దూరంలో ఉన్నప్పుడే మొబైల్ లో అలారం వంటిది వినిపిస్తుంది.

139 నెంబర్ కు కాల్ చేయడం:
రైల్వే సంస్థలో  ఐవీఆర్ కు కాల్ చేసి, ఈ సేవ ద్వారా ప్రయోజనం పొందవచ్చును. ఈ 139 నెంబర్ కు కాల్ చేసి మీ భాషను సెలెక్ట్ చేసుకుని , ఆపై డియోర్  7. ఆ తర్వాత రెండు నొక్కితే కాల్ డెస్టినేషన్ ప్రారంభం అవుతుంది.

మిమ్మల్ని మేలుకొలిపే కాల్ :
రైల్వేలు ఈ సేవని వేకప్ కాల్ అని పేరు నమోదు చేశారు. ఇందులో మీరు కూడా మీ ఫోన్ నెంబర్ నమోదు చేసుకుంటే, మీ ఫోన్.. స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు రింగ్ అవుతుంది. మీ ఫోన్ కు సమాధానం ఇచ్చే అంతవరకు అది అలానే మోగుతూనే ఉంటుంది. అయితే ఈ సేవలు మీరు వినియోగించుకోవాలి అనుకుంటే ఎస్ఎమ్ఎస్ ద్వారా అయితే మూడు రూపాయలు వసూలు చేస్తారు. అదే కాల్ ద్వారా అయితే 60 సెకండ్లు కాల్ కు ఇతర నగరాలకు నిమిషానికి రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తే, మెట్రో నగరాలకు రూ.1.20 వసూలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: