ఫేమస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే ఎంత ఫేమస్ అయిందో తెలిసిన విషయమే. ఇక ఈ టిక్ టాక్ యాప్ ఎంతో మంది లోకల్ టాలెంట్ప్రజలను ప్రపంచానికి పరిచయం చేసింది. టిక్టాక్ యాప్ వలన సెలబ్రెటీలుగా మారిన వారు కొన్ని వేలమంది వున్నారు. అయితే, ఇండియా, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా గతేడాది టిక్టాక్ను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం. ఇక అప్పటి నుంచి కూడా ఈ యాప్ రాక కోసం వేయికళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు టిక్టాక్ లవర్స్. అయితే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా అస్సలు కనిపించడం లేదు. ఇక దీంతో టిక్టాక్ యాప్ ఓనర్ బైట్డ్యాన్స్ దీనికి సంబంధించిన ఏఐ టెక్నాలజీని ఇతర సంస్థలకు అమ్మేయాలని నిర్ణయం తీసుకుంది. ‘బైట్ ప్లస్’ పేరుతో టిక్టాక్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఇండియాకు చెందిన సోషల్ గేమింగ్ ప్లాట్ఫామ్కు అమ్ముతోంది.
ఇక ఇండియాకు చెందిన పలు కంపెనీలు కూడా టిక్టాక్ టెక్నాలజీని సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబర్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇండియాకు చెందిన సోషల్ గేమింగ్ ప్లాట్ఫామ్ గేమ్స్ యాప్ ఇంకా అమెరికాకు చెందిన ఫ్యాషన్ యాప్ గోట్ ఇంకా సింగపూర్కు చెందిన ట్రావెల్ సైట్ వీగో అలాగే ఇండోనేషియాకు చెందిన షాపింగ్ యాప్ చిలిబెలి వంటి కంపెనీలకు బైట్డ్యాన్స్ తన ఏఐ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయనుందని సమాచారం అందింది.ఇక 2020 వ సంవత్సరంలో, టిక్టాక్తో సహా చైనాకు చెందిన అనేక యాప్స్ను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్స్ వలన దేశ భద్రతకు, దేశ రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న క్రమంలో గత సంవత్సరం ఈ యాప్స్పై నిషేధం విధించడం జరిగింది. ఇక అందులో ముఖ్యంగా ఈ టిక్టాక్ యాప్ కూడా ఉండటం గమనార్హం.