ఈ రోజుల్లో సాధారణం గా స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండటం లేదు. అంతే కాకుండా ఫోన్ ఉందంటే అందులో వాట్సప్ తప్పని సరిగా ఉంటుంది. ఇప్పటి వరకూ ఎన్నో మెసేజింగ్ యాప్ లు వచ్చినా వాట్సప్ కు గట్టి పోటీ ఇచ్చిన యాప్ ఇప్పటి వరకూ రాలేదు. అంతే కాకుండా వచ్చి యేళ్లు గడుస్తున్నా వాట్సప్ ఫ్రీ సర్వీస్ ను అందిస్తోంది. ఇదిలా ఉండగా వాట్సప్ లో ఎన్నో ఫీచర్ లు అందుబాటులో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అందులో మనకు నచ్చని వ్యక్తిని బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఒకటి. అయితే ఎవరైనా మనల్మి బ్లాక్ చేసారా అన్నిమాత్రం మనకు తెలియదు. కానీ కొన్ని ట్రిక్స్ ఉపయోగించి మనల్ని ఎవరైనా బ్లాక్ చేసారా అన్నది తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్కోసారి వాట్సాప్ లో మన మేస్సేజ్ అవతలి వ్యక్తికి చేరవు. మనం వీడియో కాల్ చేసినా..లేదంటే ఆడియో కాల్ చేసినా కాల్ కలవదు. అలాంటి సమయంలో మనల్ని బ్లాక్ చేసినట్టు అనుమానించవచ్చు. అయితే నెట్ వర్క్ అందుబాటులో లేకున్నా కాల్స్ కలవవు...మెసేజ్ లు సెండ్ అవ్వవు కాబట్టి అది గుర్తు ఉంచుకోవాలి. మరో ట్రిక్ ఏంటంటే మనల్ని అవతలి వ్యక్తి బ్లాక్ చేస్తే అతడి డీపీని మనం చూడలేము. అంతే కాకుండా అతడి లాస్ట్ సీన్ స్టేటస్ కూడా మనకు కనిపించదు. అలాంటి సమయం లో కూడా మనల్ని బ్లాక్ చేశారని అనుమానించవచ్చు.
అయితే డీపీ వాళ్లు పెట్టుకోకపోయినా....లాస్ట్ సీన్ డిసెబుల్ చేసినా అవి కనిపించవు. కాబట్టి అది కూడా గుర్తు ఉంచుకోవాలి. ఇక లాస్ట్ ట్రిక్ మాత్రం మిమ్మిల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే కచ్చితంగా గుర్తిస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం...మీ కాంటాక్ట్స్ లో మీకు అనుమానం ఉన్న వ్యక్తి నంబర్ ను మొదటగా ఫీడ్ చేసుకోండి. ఆ తరవాత వారితో ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. అలా గ్రూప్ క్రియేట్ చేసే సమయంలో గ్రూప్ క్రియేట్ అయితే అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ గ్రూప్ క్రియేట్ అవ్వకుండా కుడ్ నాట్ యాడ్ దిస్ నేమ్ లేదా నంబర్ అని మీకు చూపిచ్చిందంటే మీ నంబర్ ను వాళ్లు కచ్చితంగా బ్లాక్ చేసినట్టుగా మీరు గ్రహించాలి.