వన్ ప్లస్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి పెర్ఫార్మన్స్ వున్న ఫోన్ గా మార్కెట్ లో దూసుకుపోతుంది. ఇండియా మార్కెట్లోకి కూడా వరుస స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ వన్‌ప్లస్ కంపెనీ దూసుకుపోతుంది.ఈ మధ్యనే వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీని విడుదల చేసిన వన్ ప్లస్ కంపెనీ.. ఇప్పుడు వన్ ప్లస్ నార్ట్ 2ని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం విడుదలైన వన్ప్లస్ నార్డ్కు కొనసాగింపుగా ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ 2 విషయానికి వస్తే దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, హోల్ పంచ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ఎస్ఓసీ ప్రాసెసర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటుగా మరిన్ని అద్భుతమైన కొత్త ఫీచర్లను అందించినట్లుగా గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది వన్ప్లస్ కంపెనీ. ఈ స్మార్ట్ఫోన్ను త్వరలోనే ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ 2కు సంబంధించిన రిలీజ్ అప్డేట్ను అమెజాన్ ఇండియా టీజ్ చేయడం జరిగింది.అంటే ఇది అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సమాచారం తెలుస్తోంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే...5జీ కనెక్టివిటీ సపోర్ట్తో వచ్చే వన్‌ప్లస్ నార్డ్ 2లో 6.43 అంగుళాల డిస్ప్లే ఉండటం విశేషం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ఓఎల్‌ఇడి టెక్నాలజీ, ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇక, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటుగా 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఇంకా 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్ కెమెరా ఉండటం ఆకట్టుకునే విషయం. అంతేకాక, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో ప్రత్యేకంగా 32 ఎంపి కెమెరాని అందించింది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కి 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది.ఇక అంతేగాక దీనితో పాటుగా రికార్డింగ్ సమయంలో HDR ఎఫెక్ట్స్ను ప్రారంభించే AI వీడియో ఎన్హాన్స్మెంట్ టూల్ను కూడా వన్ ప్లస్ కంపెనీ అందించనుంది. ఇక అలాగే డిస్ప్లే, గేమింగ్ ఇంకా వీడియో ప్లేబ్యాక్ ఆపరేషన్స్లో చాలా ఫస్ట్ గా పనిచేసేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహకరిస్తుంది.