ఫోన్ పోయిందా? అయితే ఇలా చెయ్యండి...

స్మార్ట్‌ ఫోన్‌ అనేది ఇప్పుడు మన నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది.ఇక ఈ కాలంలో మనిషి ఏమి లేకున్న బ్రతుకుతాడేమో కాని స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం అస్సలు బ్రతకలేడని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది మనిషి బాడీలో ఒక పార్ట్ లా మిగిలిపోయింది. ఇక పెరుగుతున్న టెక్నాలజీతో మన చేతుల్లోకి అన్ని రకాల సేవలను స్మార్ట్‌ఫోన్‌ అనేది అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే రకరకాల యాప్‌లు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో భౌతికంగా నగదును క్యారీ చేయడం ఇప్పుడు తక్కువైందనే చెప్పాలి.ఇక కూరగాయల నుంచి సూది మందు వరకు ప్రతి చోట యూపీఐ సేవలను ఇప్పుడు బాగా ఉపయోగిస్తున్నాం.ఇక మనలో చాలా మంది కూడా ప్రతి చోట నగదు లావాదేవీలను డిజిటల్‌ రూపంలోనే ఇప్పుడు చేస్తున్నాం.అంతలా ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బాగా అవసరమైంది.


ఒకవేళ ఫోన్ పోతే పరిస్థితి ఏంటనే విషయానికి వస్తే..ఖచ్చితంగా మీ ఫోన్ మిస్ అయ్యిందంటే మీ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు స్వాహా అయినట్లే.తాజాగా స్మార్ట్‌ఫోన్‌లను దొంగిలించిన దొంగలు టెక్నాలజీని వాడుకొని ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు.ఇక దొంగిలించిన స్మార్ట్ ఫోన్‌ను  బ్లాక్‌ మార్కెట్‌ అమ్మడంతో పాటు, ఫోన్లో ఉన్న డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ల నుంచి కూడా నగదును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని కూడా దొంగలు సేకరిస్తున్నారు.ఇక ఫోన్ కనుక పోతే ఖచ్చితంగా ఇలా చెయ్యండి. ముందుగా చెయ్యాల్సిన పని ఏంటంటే మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను పూర్తిగా బ్లాక్‌ చెయ్యాలి.అలాగే మీ సిమ్‌ కార్డుతో రిజిస్టర్‌ అయిన యూపీఐ సేవలను వెంటనే డియాక్టివేట్‌ చేయాలి.అలాగే మీ ఫోన్‌లో ఉన్న సిమ్‌ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి.ఇక మీ నంబర్‌పై రిజిస్టర్‌ అయిన అన్ని మొబైల్‌ వ్యాలెట్లను కూడా బ్లాక్‌ చేయండి.ఇక ఫైనల్ గా మీకు దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మరచిపోకుండా కంప్లైంట్‌ ని రిజిస్టర్‌ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: