ఆపిల్ యూజర్లకు శుభవార్త.. బై నౌ పే లేటర్ ఆఫర్...

ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన క్వాలిటీతో ఇంకా సరికొత్త సర్వీస్ లతో ఎప్పుడు కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంటుంది. ఇక ఆపిల్ తన కంపెనీ నుంచి వినియోగదారులకి కొత్త పేమెంట్ సర్వీస్ ను తీసుకురాబోతోంది.ఇక ఈ కొత్త సర్వీసు ద్వారా మీకు నచ్చిన ఏ ప్రొడక్ట్ అయినా కొనుకోవచ్చు ఆ తర్వాత ఆన్ లైన్ ఇన్ స్టాల్ మెంట్సులో ఆ ప్రోడక్ట్ పేమెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఆపిల్ పే తన యూజర్ల కోసం ఈ బై నౌ పే లెటర్ (బి ఎన్ పి ఎల్ ) అనే కొత్త సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతుంది.ఇక ఆపిల్ పే లెటర్ సర్వీసు గోల్డ్ మ్యాన్ సాచ్స్ భాగస్వామ్యంలో ఆపిల్ కంపెనీ ఈ కొత్త సర్వీసుపై పని చేస్తోంది.ఇక ఒకసారి ఈ సర్వీసు అందబాటులోకి వచ్చాక అన్ని స్టోర్లలో యూజర్లు పేమెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చునట. ఈ సర్వీసును రెండు రకాలుగా వినియోగదారులు వినియోగించుకోవచ్చు.వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుకు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒకవేళ వినియోగదారులు ఆపిల్ పే లో 4 ఆప్షన్ ఎంచుకుంటే కొనుగోలు వస్తువుపై రెండు నెలల్లో వడ్డీ లేకుండా నాలుగు సార్లు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు.అంటే ఆపిల్ యూజర్లు ప్రతి రెండు వారాలకు ఒకసారి పేమెంట్ చేసుకోవచ్చు.అలాగే ఆపిల్ పే యూజర్లు ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేసుకునే అవకాశం వుంది. అలాగే ఇందులో మరో ఆప్షన్ కూడా ఉందట. మీ పేమెంట్ పిరియడ్ మరిన్ని నెలలకు కూడా పెంచుకోవచ్చునట. అయితే దీనికి ఖచ్చితంగా వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే లాంగ్ టెర్మ్ ప్లాన్లపై మాత్రమే వడ్డీ అనేది ఉంటుంది.ఇక అందులో పేమెంట్ ప్లాన్లు లేట్ ఫీజులు ఇంకా ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉంటాయి. బ్లూమ్బెర్గ్ రిపోర్టు ప్రకారం చూసినట్లయితే కొనుగోళ్లపై ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తుందో తెలూసుకోవాలంటే ఆపిల్ ఈ పేమెంట్ సర్వీసును లాంచ్ చేసే వరకు ఎదురు చూడాల్సిందే.. ఇక ఈ కొత్త పేమెంట్ సర్వీసు రిపోర్టుపై ఆపిల్ కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇప్పటికే ఆపిల్ కార్డ్ సర్వీసును అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: