ట్విట్టర్ కు షాక్ ఇచ్చిన కొత్త ఫీచర్ ?
దీనికి అనుగుణంగా ఒక గ్రీవెన్స్ అధికారిని కూడా నియమించిన సంగతి తెలిసిందే. ఇలా జరుగుతుంటే, ట్విట్టర్ నిన్న విడుదల చేసిన ఫ్లీట్స్ ఫీచర్ యూజర్ లను ఆకట్టుకోవడంలో విఫలమైనందున ఆగష్టు 3 వతేదీన ఆ ఫీచర్ ను తొలగిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో ట్విట్టర్ టీమ్ తెలిపింది. ఈ ఫీచర్ ను గత నవంబర్ లోనే స్టార్ట్ చేసినట్లుగా తెలిసిన విషయమే. ఈ ఫీచర్ తో యూజర్ ఫుల్ స్క్రీన్ తో ఫోటోలు మరియు వీడియోలను తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ ఫీచర్ స్నాప్ చాట్ మరియు ఇంస్టా గ్రామ్ లాంటి యాప్ లకు పోటీగా నిలిచింది. కానీ 24 గంటలు తిరక్కుండానే యూజర్స్ కు షాక్ ఇచ్చింది. వెంటనే ట్విట్టర్ నుండి ఫ్లీట్ ఫీచర్ రిమూవ్ అయిపోయింది. అంతే కాకుండా సిఎన్బిసి ఇచ్చిన ప్రకటన ప్రకారం, ఫీచర్ ద్వారా యూజర్ల సంఖ్య పెరగలేదని తెలుస్తోంది.
ఈ ఫీచర్ను ట్విట్టర్ తీసుకురావడానికి కారణం ఎక్కువ మంది యూజర్ లు కంటెంట్ ను ఈజీ గా పోస్ట్ చేయడానికని తెలుస్తోంది. కానీ ట్విట్టర్ అనుకున్న విధంగా ఇది ఆదరణ పొందలేకపోయిందని అధికారిక సమాచారం. అయితే ఇంకా ముందు ముందు మరిన్ని కొత్త ఫీచర్ లను తీసుకురావడానికి ట్విట్టర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.