ఇక యూ ట్యూబ్ ఎంత ఫేమస్ యాపో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ ప్రపంచంలో యూ ట్యూబ్ ని చూడని మనుషులంటూ ఎవ్వరూ వుండరు. పిల్లల నుంచి పెద్దలు దాకా ప్రతి ఒక్కరూ కూడా యూ ట్యూబ్ ని చూడటానికి తెగ ఇష్టపడతారు.ప్రపంచంలో అత్యధికమంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా యూట్యూబ్ సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. ఈ
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మిగిలిన యాప్‌లను వెనక్కి నెట్టి ఇప్పుడప్పుడే ఎవ్వరికి అందనంత ఎత్తులో యూ ట్యూబ్ నిల్చుంది.ఇక ప్రస్తుతం ప్రపంచ
జనాభా వచ్చేసి 790 కోట్లు ఉంటే , అయితే ఇప్పటి దాకా కూడా యూ ట్యూబ్ ఏకంగా వెయ్యి కోట్లసార్లు డౌన్‌లోడ్ అయ్యింది. ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతానికి 20.89 లక్షల యాప్‌లు అనేవి ఉన్నాయి. ఇక వీటన్నింటీని కూడా వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో యూట్యూబ్ నిలిచింది.
ఇక ఈ సంవత్సరం ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్తగా 300 కోట్ల యాక్టివేషన్లు కూడా వచ్చాయి. దీంతో యూట్యూబ్ సెన్సేషనల్ వరల్డ్ రికార్డు అనేది సాధించగలిగింది.ఇప్పుడు ఏకంగా ప్రపంచ జనాభాను మించి యూట్యూబ్ యాప్ వెయ్యి కోట్ల సార్లు డౌన్‌లోడ్ అయ్యిందట.ఇక ప్లే స్టోర్‌కి సంబంధించి యూట్యూబ్ తర్వాత స్థానంలో 700 కోట్ల డౌన్‌లోడ్లలతో
ఫేస్‌బుక్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత వాట్సప్ 600 కోట్లు ఇంకా
ఫేస్‌బుక్ మెసేంజర్ 500 కోట్లు అలాగే
ఇన్‌స్టాగ్రామ్ 300 కోట్ల సార్లు ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.ఇక సంచలనాలకు
కేంద్ర బిందువుగా మారి ఎక్కువ ప్రజాదారణ పొందిన
టిక్‌టాక్ 200 కోట్లు ఇక అడ్వన్చర్
గేమ్ సబ్‌వే సర్ఫర్ వంద కోట్లకు పైగా డౌన్‌లోడ్లను సాధించాయి.అలాగే
ఫేస్‌బుక్ లైట్ ఇంకా మైక్రోసాఫ్ట్ వర్డ్ అలాగే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్‌లు కూడా రెండు వందల కోట్ల దగ్గరగా డౌన్‌లోడ్ అవ్వడం జరిగాయి.