వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా స్పీడ్ మెసేజీంగ్ యాప్ గా వాట్సాప్ మంచి పేరుని సంపాదించుకుంది.ఇక వాట్సాప్ కంపెనీ రోజు రోజుకి కూడా తన వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇక తన సరికొత్త ఫీచర్స్ వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక వాట్సాప్ తన వినియోగదారులకు మంచి అనుభూతిని అందించడం కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇక ఇప్పటి వరకు మనకు వాట్సాప్ వెబ్ ఇంకా డెస్క్ టాప్ యాప్ ద్వారా నేరుగా ఫోటోలను పంపే ఆప్షన్ మాత్రమే ఉండేది. అయితే, వాట్సాప్ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ వల్ల ఫోటోను ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఇక ఈ అవకాశం ఇప్పటివరకు మొబైల్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది.ఈ సరి కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఫోటోలను పంపడానికి ముందు స్టిక్కర్లను, ఏమోజీ ఇంకా క్రాప్ చేయడానికి అదనపు ఆప్షన్ తో ఎడిట్ ఫీచర్ తీసుకొని రావడం జరిగింది.
ఇక ఈ ఫీచర్ వెంటనే వాట్సాప్ యూజర్లందరికీ ఇప్పుడే వెంటనే రాకపోవచ్చు.ఇది దశల వారీగా వెబ్ ఇంకా డెస్క్ టాప్ యూజర్లకు తీసుకోని రానున్నట్లు తన బ్లాగ్ లో పేర్కొనడం జరిగింది. ఇక కొద్ది రోజుల క్రితమే 'వ్యూ వన్స్' పేరుతో ఇంతకు ముందు ఒక ఫీచర్ తీసుకొని రావడం జరిగింది. ఇక వ్యూ వన్స్ ఫీచర్‌లో భాగంగా వాట్సాప్ యాప్‌లో ఫోటో లేక వీడియోను సెండ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ బార్ పక్కన కొత్తగా '1' చిహ్నాంపై ట్యాప్ అనేది చేయాలి. ఇక దీంతో రెసిపెంట్ మీరు పంపిన ఫోటోను లేదా వీడియోను ఒక్కసారి మాత్రమే చూడగలరు.ఇక రెసిపెంట్ మేసేజ్‌ను ఒపెన్ చేశాక ‘ఒపెన్డ్’ అనే సందేశం అనేది మీకు కన్పిస్తుంది. వ్యూ వన్స్ ఫీచర్‌తో మీడియా కంటెంట్‌ను రెసిపెంట్(గ్రహీత) ఫోటోలు లేదా వీడియోలు మొబైల్ గ్యాలరీలో అసలు సేవ్ కావు.ఇలా ఆకట్టుకునే ఫీచర్స్ తో వాట్సాప్ తన వినియోగదారులను ఎప్పటికప్పుడు ఎంతగానో ఆకట్టుకుంటూనే వుంది.