మ్యాజిక్ చేసే 'ఫోటోగ్రఫీ' గురించి మీకు తెలియని రహస్యాలివే ?
* ఈ ఫోటోగ్రఫీ అనేది మనుషులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కొందరైతే ఈ ఫొటోగ్రఫీకి దాసోహమయిపోతారు. అంతలా ఫోటోగ్రఫీని ఇష్టపడుతారు. అంతెందుకు ఇప్పుడు పగోటోగ్రఫీ కోసం ప్రత్యేక కోర్సులు కూడా ఉండడం దీని ఆవశ్యకతను తెలియచేస్తుంది.
* ఎంతోమంది ఫోటోగ్రఫీని వారి కెరీర్ గా ఎంచుకుంటున్నారు. అందులో ఎంతో ప్రావీణ్యత సంపాదించి సినిమా ఇండస్ట్రీలలో స్థిరపడుతున్నారు.
* అదే విధంగా కొంతమంది టైం పాస్ చేయడానికి ఫొటోగ్రఫీతో గడుపుతారు. ఎన్నో సుందరమయిన దృశ్యాలను తమ కెమెరాలలో బంధించి ఆనందపడుతుంటారు.
* ఒక ఫొటోగ్రఫీకి ఉన్న శక్తి దేనికీ లేదని చెప్పాలి. ఒక మనిషి వివరించి చెప్పలేని ఎన్నో విసహాయాలను ఒక ఫోటోగ్రఫీ ద్వారా చెప్పవచ్చును.
* ఈ ఫోటోగ్రఫీ గురించి ఎంతోమంది దాని గొప్పతనం మరియు విలువ గురించి చెప్పి ఉన్నారు.
ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఎంతో గొప్ప పేరును సంపాదించుకుని తమ పేరును ప్రపంచం దృష్టిలో నిలబడిపోయేలా చేసిన వారు కొందరున్నారు.
రాబర్ట్ ఫ్రాంక్: ఈయన చాలా మందిలాగే 1947 లో స్విట్జర్లాండ్ లో ఒక సాధారణ కమర్షియల్ ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి అతి కొద్ది కాలంలోనే గొప్ప ఫోటోగ్రాఫర్ స్థాయికి ఎదిగాడు. కేవలం 6 సంవత్సరాలలోనే అమెరికాలో గొప్ప ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు.
వీగీ: ఈయన 1930 మరియు 1940 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో కెల్లా ప్రసిద్ధి చెందిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోళ్లను తీయడంలో సుప్రసిద్ధుడు. ఇతను మరణించినా ఇప్పటికీ ఇతని గురించి మనము చెప్పుకునేలా చేశాడు.
డాన్ మెకల్లిన్: ఇంగ్లాండ్ కు చెందిన ఇతను యుద్దానికి సంబంధించిన చిత్రాలను వేయడం ద్వారా వాటి వెనుకున్న సత్యాలను ప్రజలకు తెలియచేయడంలో సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా ఒక జర్నలిస్టుగా కూడా ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నాడు. లండన్ లో ఉన్న పెదాలు పడుతున్న కష్టాలను తొలగించడంలో ఈయన కృషి మరువలేనిది.
హోమై వ్యరవల్లా: ఈమె మన ఇండియా నుండి వచ్చిన మొదటి ఫోటో జర్నలిస్ట్. ఈమె దాదాపుగా 40 సంవత్సరాల పాటు తన ఫోటోగ్రఫీ వృత్తిని కొనసాగించింది. ఈమె ఫోటోగ్రఫీలో తాను చేసిన సేవలకు గానూ 2011 లో పద్మ విభూషణ్ పొందినది.
డానిష్ సిద్ధిఖీ: ఇండియా నుండి వచ్చిన మరో ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ. ఈయన చివరి సారిగా రాయిటర్స్ పత్రికలో పనిచేశారు. మొన్న ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి దురాగతాలను తా కెమెరాలో బంధించారు. అంతే కాకుండా జులైలో ఆఫ్గనిస్తాన్ దేశాన్ని తాలిబన్ లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలను కవర్ చేస్తున్న సమయంలోనే తన చివరి శ్వాస వదిలాడు.
ఇలా ఎంతోమంది ఫోటోగ్రఫీలో గొప్ప వారున్నారు. ఈ రోజు అలంటి వారందరినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.