గురూ... 'ప్రొఫెషనల్ కెమెరా' కొనాలా ఈ విషయాలు తెలుసుకోండి ?

VAMSI
మారుతున్న కాలంతో పాటుగా టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫోటోగ్రఫీ అనే అందమైన ప్రక్రియ కోసం ఉపయోగించే కెమెరాలు ఎన్నో మోడల్స్ ఉన్నాయి. కానీ రోజు రోజుకి వాటి టెక్నాలజీలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ ఫోటోగ్రఫీని ఎంతో మంది యువత చాలా ఇష్టంగా ఫ్యాషన్ గా ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. అయితే ఇలాంటి వారు మంచి టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఉపయోగిస్తేనే వీడియోలు కానీ ఫోటోలు కానీ చాలా క్వాలిటీగా వస్తాయి. ప్రస్తుతం మనకున్న అందుబాటులో మంచి టెక్నాలజీ కలిగిన కెమెరాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ 2021 వ సంవత్సరంలో అత్యుత్తమ కెమెరా సిస్టం కలిగిన ప్రొఫెషనల్ కెమెరా ఏది అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ప్రొఫెషనల్ కెమెరా అనేది క్రీడలను రికార్డు చేయడానికి, ఎక్కువ రెసొల్యూషన్ కలిగిన ఫొటోగ్రఫీ మరియు క్వాలిటీ కలిగిన వీడియోలను తీయడానికి ఉపయోగపడుతుంది.

మీరు మంచి ప్రొఫెషనల్ కెమెరాను ఎంచుకోవాలంటే.. అందులో ఎక్కువ రెసొల్యూయేషన్ ఉండేలా చూసుకోవాలి. అన్ని రకాల ఫీచర్స్ అందులో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కమెర్షియల్, ల్యాండ్ స్కేప్, ఫ్యాషన్ మరియు ట్రావెల్ ఫోటోగ్రఫీ ల కోసం ఎక్కువ రెసొల్యూషన్ ఉండాలి.  క్రీడలకు సంబంధించిన ఫోటోలను విడిలను రికార్డు చేయడానికి మరియు వార్తలను సేకరించడానికి, ఆ కెమెరాలలో ఎక్కువ వేగం, ఆటో ఫోకస్ మరియు లైటింగ్ కూడా తక్కువగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి.
మీరు ప్రొఫెషనల్ కెమెరాలను కొనడానికి ముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి.

 
* కేవలం మంచి స్పెసిఫికేషన్ ఉంటే వెంటనే కొనేయకండి. ఆ కెమెరా యొక్క సిస్టం ఎలా ఉంది. లెన్స్  ల పనితీరును గమనించండి. ఇప్పటి వరకు ఆ సిరీస్ లో వచ్చిన మోడళ్లను అలాగే రాబోయే మోడల్స్ గురించి కొంచెం తెలుసుకుని కొనడం మంచిది.

* ఇప్పటి వరకు మీరు ఉపయోగించిన కెమెరా సిస్టం నుండి వేరొక సిస్టం ను కొనాలనుకుంటే వాటికి...ఇప్పుడు మీరు కొనబోయే సిస్టం కు మధ్యన ఉన్న సారూప్యతలు గమనించండి. కొత్త సిస్టం ను తీసుకొని కన్ఫ్యూజ్ అవడం కన్నా, ఇప్పటికే మీరు వాడుతున్న సిస్టం లో తరువాత మోడల్ ను తీసుకోవడం మంచిది.

* లెన్స్ లు మీకు ఏవి అవసరమో ముందుగా తెలుసుకోండి. మీరు వాడే లెన్స్ లతో ఇవి సరిపోతాయా లేదా ఇవి కొత్తగా ఉన్నాయా చూడండి. మనకు తెలిసి కేనన్ లేదా నికాన్ లెన్స్ బాగుంటాయి.

* ప్రొఫెషనల్ కెమెరాలలో ఎప్పటికీ మిర్రర్ కెమెరాలు అధిక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంటే మీరు DSLR కెమెరాలను మాత్రమే ఎంపిక చేసుకోండి.

* కొంతమంది వీడియోలకు మాత్రమే కొన్ని కెమెరాలను వాడుతుంటారు. అలాగే మరికొందరు వీడియోలతో పాటు స్టిల్స్ ను సైతం తీయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ డ్స్లర్ మరియు మిర్రర్ లెస్ కామెర్లు రెండూ కూడా వీటికి సరిగ్గా సరిపోతాయి. అయితే అందరూ కూడా మిర్రర్ లెస్ కెమెరాలను వీడియోల కోసం సూచిస్తుంటారు.

ఈ విధంగా మీరు ప్రొఫెషనల్ కెమెరాను కొనాలి అనుకుంటే పై విషయాలను గుర్తుంచుకుని కొనడం ప్రధానం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: