ఇక జపనీస్ కార్ బ్రాండ్ హోండా, ఇండియా మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని వ్యాప్తి చేసేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవలే తమ కొత్త honda Amaze కాంపాక్ట్ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన honda Cars india Limited, త్వరలోనే ఓ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్ ని విడుదల చేయబోతున్నట్లు తెలపడం జరిగింది.ఇక ప్రస్తుతం హోండా కంపెనీ తమ భారత ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో, కొత్త అమెజ్ , 5జి హోండా సిటీ సెడాన్, 4జి హోండా సిటీ సెడాన్, WR-V క్రాసోవర్ ఇంకా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను అమ్ముతుంది. ఇక గత సంవత్సరం చివర్లో కంపెనీ తమ లైనప్‌లో ఖరీదైన సిఆర్-వి ఎస్‌యూవీ ఇంకా సివిక్ సెడాన్ మోడళ్లను నిలిపివేసిన విషయం తెలిసినదే.ఇక ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్లకు చాలా మంది కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు.
ఇక ఈ విభాగంలోని డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు హోండా కూడా సిద్ధమైంది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హోండా కంపెనీ నుండి రానున్న ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్ ని అంతర్గతంగా 31XA అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేయడం జరుగుతుంది.ఇక ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్ ని కంపెనీ ప్రస్తుతం అమ్ముతున్న మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుందని భావిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి honda Cars india Limited సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ, ఇది (కొత్తగా రాబోయే ఎస్‌యూవీ) ఇండియా స్పెసిఫిక్ మోడల్‌గా ఉంటుందని ఆయన అన్నారు.ఇక ఈ క్రమంలో, హోండా తమ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్ ని ముందుగా ఇండియా మార్కెట్లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.ఇక ఈ కొత్త ఎస్‌యూవీ కార్ ని అభివృద్ధి చేయడానికి చాలా పెట్టుబడి ఇంకా సమయం అవసరం కాబట్టి, దీనిని తర్వాత కాలంలో విదేశీ మార్కెట్లలో కూడా విడుదల చేసే అవకాశం ఉందట.