శాస్త్రవేత్తలు సరికొత్త పరిశోధనలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తూ వస్తున్నారు. మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా కృత్రిమంగా సృష్టించే దిశలో శాస్త్రవేత్తలు ఎంతో ముందడుగు వేస్తున్నారు. ఇక ఇప్పటికే మానవ శరీరంలోని కొన్నిరకాల కృత్రిమ అవయవాలను సృష్టించి.. అవయవాలు కోల్పోయినవారికి మంచి జీవితాన్ని ఇచ్చిన శాస్త్రవేత్తలు మరో ప్రయోగం చేసి ముందడుగు వేశారు. ఈసారి ఏకంగా కృత్రిమ మానవ మెదడును వారు సృష్టించారు. జర్మన్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమ మానవ మెదడును క్రియేట్ చేశారు. ఇక మరో అద్భుతం ఏంటంటే ఈ చిన్న మెదడుకి కళ్ళు కూడా ఉన్నాయి. కళ్ళు పూర్తిగా డెవలప్ అవ్వకపోయినా కాని ఈ చిన్న మెదడు మానవ మూలకణాల నుండి అభివృద్ధి చేయడం జరిగింది.ఇక ఈ మెదడుని ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్ ఇంకా జర్మనీ పరిశోధకులు తయారు చేయడం జరిగింది.ఈ మినీ మెదడులోని కళ్ళు 5 వారాల పిండంలా బాగా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ఫ్యూచర్ లో దీని నుండి అనేక కొత్త విషయాలు కూడా వెల్లడవుతాయి. అంతేగాక ఇది అనేక జబ్బుల చికిత్సలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఇక ఈ మినీ బ్రెయిన్ సైజు వచ్చేసి 3 మిమీ. వెడల్పుగా ఉంటుంది. ఇందులో ఉండే కళ్లలో కార్నియా, లెన్స్ ఇంకా రెటీనా కూడా ఉన్నాయి. ఇక దాని సహాయంతో అది కాంతిని సులభంగా చూడగలుగుతుంది. అలాగే ఈ కళ్ళు న్యూరాన్లు ఇంకా నరాల కణాల సహాయంతో మెదడుతో కూడా చాలా సులభంగా కమ్యూనికేట్ చేయగలవు. ప్రయోగశాలలో రెడీ చేసిన ఈ రెటీనా భవిష్యత్తులో వస్తువులను చూడలేని పోయిన వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.ఇక సెల్ స్టెమ్ జర్నల్లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం తెలిసిందేంటంటే ఈ కళ్ళపై కాంతి కిరణాలు పడినపుడు ఆ సంకేతాలు మెదడుకు చేరడం జరిగింది. కళ్ళు చూసేవి మెదడుకు చేరుతున్నాయని ఇది రుజువు చేయడం జరిగింది. ప్రయోగశాలలో డెవలప్ చేసిన మెదడులో ఇది మొదటిసారిగా కనిపించింది.