బుల్లిపిట్ట: కేవలం రూ.397 ఏడాదిపాటు సర్వీస్..?

Divya
ప్రస్తుత టెలికాం దిగ్గజం సంస్థలలో జియో నే మొదటి స్థానం దక్కించుకుంది. ఇక జియోతో పోటీ పడడం కోసం కొన్ని టెలికాం సంస్థలు వారికి తగినటువంటి ఆఫర్లను కస్టమర్ల కోసం ప్రకటిస్తూనే ఉన్నాయి. అలా అలా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు bsnl కూడా సరికొత్త ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఆ వివరాలను చూద్దాం.

కస్టమర్లకు అతి తక్కువ ధరలకే సంవత్సరం పాటు పూర్తి వ్యాలిడిటీ ఉండే ఒక ఆఫర్ ను విడుదల చేసింది. bsnl టెలికాం సంస్థ. ఇది bsnl లోనే బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గా చెప్పవచ్చు. 397 రూపాయలకే ఒక రీఛార్జ్ ఆఫర్ ను విడుదల చేసింది బిఎస్ఎన్ఎల్. ఈ అమౌంట్ ని లెక్కకడితే.. కేవలం ప్రతి రోజు రూ.1.08 మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పవచ్చు.
ఈ ప్లాన్ యొక్క ఆఫర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ 397 రూపాయలను రీఛార్జ్ చేసుకున్నట్లయితే.. ఒక ఏడాది పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా bsnl  వినియోగదారులకు...అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజు..2GB డేటాను, రోజుకు 100 SMS లను లభిస్తుంది.
అయితే ఈ అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు టు జీబీ డేటాను, సంవత్సరం పొడవునా ఉపయోగించుకునే విధంగా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ ను  కల్పించింది. ఇక ఈ రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు ఏడాది పొడవునా ఉచిత వాయిస్ కాలింగ్ అందించినా, ఎస్ఎంఎస్ కు అలాగే డేటా మాత్రం కేవలం 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళకు ఇలాంటి ఆఫర్లు చాలా చక్కగా పనిచేస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి వాయిస్ కాలింగ్ ఉంటే సరిపోతుంది కాబట్టి అలాంటి వారు ఒక్కసారి ఈ 397 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే, ఇక ఏడాది పొడవునా నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ ఆఫర్ చాలా బాగుంది అంటూ కస్టమర్లు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: