బుల్లి పిట్ట: షియోమీ.. రెండు సరికొత్త వేరియంట్ లతో భారత మార్కెట్లోకి విడుదల..
ఇకపోతే ఈ మొబైల్స్ ధర ఎంత..? వీటి ఫీచర్స్ ఏంటి..? అని పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. రెడ్ మీ నోట్ 10 ప్రో :
షియోమి ప్రవేశపెట్టిన రెడ్ మీ నోట్ 10 ప్రో మోడల్ స్మార్ట్ ఫోన్ లో సిక్స్ జీ బీ ర్యామ్ అలాగే 128 జీ బీ స్టోరేజ్ వేరియంట్ తో మనకు అందుబాటులో రానుంది. ఇక దీని ధర భారత్ మార్కెట్లో రూ.17,999 గా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ 8 జీ బీ ర్యామ్ +128 జీ బీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలి అనుకుంటే , దీని ధర రూ.18,999 గా ప్రకటించడం జరిగింది.
2. రెడ్ మీ నోట్ 10 ప్రో మాక్స్ :
ఇక ఇందులో 6 జీ బీ + 128 జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను గనుక కొనుగోలు చేయాలి అనుకుంటే, దీని ధర రూ.19,999 గా నిర్ణయించడం జరిగింది. అదే 8 జీబీ + 128 జీ బీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.21,999 గా భారత్ మార్కెట్లో నిర్ణయించడం జరిగింది.