వాట్సప్ ఖాతాలు బ్లాక్.. ఎందుకంటే ..?
కొంతమంది వాట్సాప్ యాప్ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు కారణంగా , ఇండియా గ్రీవియెన్స్ ఆఫీసర్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరి ఖాతాలను ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా నిషేదించడం జరిగింది. కొత్త ఐటీ చట్టం 2021 వ సంవత్సరంకు అనుగుణంగా కొత్త ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ సంస్థ తన యూజర్ల సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ ను బయటకు విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం జూన్ 16 నుంచి జులై 31 తేదీ వరకు అంటే కేవలం 46 రోజుల వ్యవధిలోనే కొంతమంది యూజర్ల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.యూజర్లు ఇచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వాట్సాప్ తన స్వంత టూల్స్ గుర్తించిన స్పామ్ గల 3.027 మిలియన్ ఖాతాలను గుర్తించి ఇప్పుడు వాటిని నిషేధించినట్లు వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
అంటే వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం దాదాపు 3.027 మిలియన్ల ఖాతాలను నిలిపి వేసినట్లు తెలుస్తుంది. అనుమానస్పద సందేశాలతో పాటు ఫేక్ న్యూస్ లను కూడా వ్యాప్తి చేస్తున్న ఈ ఖాతాలను గుర్తించేందుకు గాను వాట్సాప్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.ఒకవేళ యూజర్లు మళ్ళీ వాట్సాప్ ప్రతినిధులను సంప్రదించాలంటే wa@support.whatsapp.comకు ఈ-మెయిల్ చేయవచ్చు అని వాట్సాప్ తన యూజర్లకు తెలిపింది.ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా కనుక బ్లాక్ అయితే పైన తెలిపిన మెయిల్ అడ్రెస్ కి మెయిల్ చేయండి.