బుల్లి పిట్ట: ఫోన్ పే లో ఇలా చేస్తే బాదుడే.. బాదుడు..?

Divya
సాధారణంగా డబ్బు విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరికైనా డబ్బు బదిలీ చేయాలనుకున్నప్పుడు, బ్యాంకులకు వెళ్లి సమయాన్ని కేటాయించి మరీ డబ్బులు పంపిస్తూ ఉంటారు.. ఇక ఈ నేపథ్యంలోనే సమయంతో పాటు శ్రమ కూడా వృధా అవుతుంది. ఇక అందుకే ఫోన్ పే, గూగుల్ పే , వాట్సాప్ పే వంటి డిజిటల్ లావాదేవీల పైన ప్రజలు మొగ్గు చూపుతున్నారు.. ఇటీవల కాలంలో ముఖ్యంగా యువత ఫోన్ పే ను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఫోన్ పే లో లావాదేవీలు జరిపేటప్పుడు, ఈ చిన్న తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా అదనపు చార్జీలు పడతాయంట.. అది ఎలాగో ఒకసారి చదివి తెలుసుకుందాం..

దేశంలోని  ప్రజలు ఎక్కువగా ఇప్పుడు డిజిటల్ లావాదేవీలనే వినియోగిస్తున్నారు. ప్రధానంగా బిల్లు చెల్లింపు విషయంలో కోట్ల మంది ఎక్కువగా ఫోన్ పే యాప్ ని వినియోగిస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామీణుల వరకు అందరూ ఎక్కువగా ఫోన్ పే ను వాడే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉండడం విశేషం. ఇక క్రెడిట్ కార్డు  నుంచి ఫోన్ పే వాలెట్ కు డబ్బులను పంపించు కుంటూ ఉంటారు.
అయితే ఇలా చేయడం వల్ల, ట్రాన్స్ఫర్ చేసిన వారికి భారీ షాక్ తగలనుంది. క్రెడిట్ కార్డుల ద్వారా మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే..100 కీ 2.06 రూపాయల ఛార్జ్ చేయబడుతుంది అన్నట్లుగా సమాచారం. ఇక ఎంత మనీ యాడ్ చేసుకుంటే అంత ఎక్కువ .. ఛార్జీలు సైతం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఫోన్ పే వాడే యూజర్లకు.. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి.
ఈ ఛార్జీలు సైతం అడిషనల్ కన్వీనియన్స్.. ఫీజు కింద ఈ మనీని మొత్తం వినియోగదారుల నుంచి తీసుకుంటోంది. ఎవరైతే క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ పే వాలెట్ లోకి మనీ ని యాడ్ చేసుకుంటారో.. వారికి మాత్రమే ఈ అదనపు చార్జీలు వర్తిస్తాయి. అలాకాకుండా డెబిట్ కార్డ్, ఇతర ట్రాన్సాక్షన్ ద్వారా మనీ ని యాడ్ చేసుకుంటే.. ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన పని ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: