రసాయన విభాగంలో నోబెల్ ఎవరికో తెలుసా?
బెంజమిన్ లిస్ట్ , డేవిడ్ డబ్ల్యూసీ మెక్ మిలన్ అనే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు అణు నిర్మాణానికి సంబంధించిన విషయాలపై ప్రయోగాలు చేశారు. ఈ అణు నిర్మాణానికి ఉపయోపడే అసిమెట్రిక్ ఆర్గానో కెటాలిసిస్ పై ప్రయోగం చేసి దాని అభివృద్ధికి కృషి చేశారు. అయితే ఇప్పటి వరకు లోహాలు, ఎంజైమ్ లు అనే ఉత్ప్రేరకాలు మాత్రమే ఉన్నాయని ఇన్నాళ్లు మన శాస్త్రవేత్తలు విశ్వసించారు. అయితే ఈ రెండిటి తో పాటు అసిమెట్రక్ ఆర్డానోకెటాలిసిస్ అనే మూడవ రకం ఉంటుందని నిరుపించి దానిని అభివృద్ధి చేశారు. దీని వల్లే బెంజమిన్ లిస్ట్ , డేవిడ్ డబ్ల్యూసీ మెక్ మిలన్ లకు నోబెల్ పురష్కారం లభించింది. అయితే వీరికి నోబెల్ పురష్కారం తో పాటు 11 లక్షల డాలర్ల నగదు ను కూడా వీరికి ఇస్తారు. కానీ ఈ నగదు ను, నోబెల్ బహుమతిని బెంజమిన్ లిస్ట్ , డేవిడ్ డబ్ల్యూసీ మెక్ మిలన్ సంయుక్తం సమానం గా పంచుకోవాల్సి ఉంటుంది. కాగ బెంజమిన్ లిస్ట్ అనే శాస్త్ర వేత్త జర్మనీ దేశానికి చెందిన వాడు. అలాగే డేవిడ్ డబ్ల్యూసీ మెక్ మిలన్ అనే శాస్త్రవేత్త స్కాట్లాండ్ అనే దేశానికి చెందిన వాడు.